• facebook
  • whatsapp
  • telegram

మేనేజ్‌మెంట్ రంగం

మేనేజ్‌మెంట్ రంగంలోకి ప్రవేశించడానికి రెండు రకాల మార్గాలున్నాయి.

1. ఏదైనా ఒక మేనేజ్‌మెంట్ విభాగంలో నిష్ణాతులవడం. ప్రస్తుతం చాలా కంపెనీలు మేనేజ్‌మెంట్ విద్యార్హత ఉన్న అభ్యర్థులనే ఈ రంగంలో ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. కాబట్టి మేనేజ్‌మెంట్ రంగంలో స్థిర పడాలనుకునే వారు దీనిలో ఏదైనా ఒక విభాగాన్ని ఎంచుకొని మంచి నైపుణ్యాలను సాధించాలి.

2. మేనేజ్‌మెంట్ రంగంలో అవకాశాలు కల్పించే సంస్థల్లో ట్రెయినీగా చేరడం.  ఇలాంటి అవకాశాలు చాలా అరుదు. సంస్థలు ఈ రంగానికి సంబంధించి అభ్యర్థికి ఉన్న పూర్వ ఉద్యోగ అనుభవాన్ని లేదా విద్యార్హతను దృష్టిలో ఉంచుకొని ఈ విధానం ద్వారా ఉద్యోగావకాశాన్ని కల్పిస్తాయి.


ఉండాల్సిన నైపుణ్యాలు:
కమ్యూనికేషన్ స్కిల్స్ - అత్యవసరం
ఫ్లెక్సిబుల్, అడాప్టబుల్ - అత్యవసరం
శక్తి సామర్థ్యాలు - అత్యవసరం
సమీకృత విధానాల ద్వారా కార్యసాధన - అత్యవసరం
పనిపట్ల ఆసక్తి - అవసరం
నిజాయితీ, సమగ్రత - అవసరం
చొరవ - తగినంత
వ్యాపార సంబంధమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం - అవసరం
ఆత్మ విశ్వాసం - అత్యవసం
నాయకత్వ లక్షణాలు - అత్యవసం
వేగంగా నిర్ణయాలు తీసుకునే దక్షత - అత్యవసరం
సమస్యలకు పరిష్కారాలను కనుక్కొనే నైపుణ్యం - అత్యవసరం

 

మేనేజ్‌మెంట్ రంగానికి సంబంధించి అనేక ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములను అందిస్తున్నాయి. ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు బీబీఏ, బీబీఎస్, బీఎంఎస్ లాంటి డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు.  ఎంబీఏ, పీజీడీఎం, మేనేజీరియల్ ఎకనామిక్స్ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి ఆయా విభాగాలకు చెందిన ప్రవేశ పరీక్షలను రాయాలి. చాలా విద్యా సంస్థలు అర్హత (కటాఫ్) మార్కులను నిర్దేశిస్తున్నాయి. సాధారణంగా 50 శాతం కంటే అధిక మార్కులు సాధించిన వారిని అర్హులుగా భావిస్తారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వాళ్లు సైతం ఈ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు- ఎంచుకున్న విభాగంలో స్పెషలైజేషన్ చేయడానికి ఉద్దేశించినవి. ఉద్యోగం చేస్తున్న వారికోసం 'ఎగ్జ్ క్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్' ఉంది. కొన్ని విద్యాసంస్థలు పార్ట్‌టైమ్ మేనేజ్‌మెంట్ కోర్సులను కూడా అందిస్తున్నాయి.

 

ఎంపిక విధానం: 
చాలా బిజినెస్ స్కూళ్లు మేనేజ్‌మెంట్ విద్యలో ప్రవేశాల కోసం ఒక ప్రామాణిక పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఐఐఎంలు కొన్ని ఇతర మేనేజ్‌మెంట్ విద్యా సంస్థలతో కలిసి క్యాట్ (CAT - కామన్ అడ్మిషన్ టెస్ట్) ద్వారా సీట్లను భర్తీ చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు మ్యాట్ (MAT - మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ) ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తున్నాయి. ఈ పరీక్షల్లో

1. వెర్బల్,
2. కాంప్రహెన్షన్,
3. డేటా ఇంటర్‌ప్రెటేషన్
4. ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు.

ప్రధానంగా ఈ నాలుగు విభాగాల నుంచే ప్రశ్నలు ఉన్నా, వాటి సరళి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. క్యాట్ పరీక్షకు సంబంధించిన వివరాలతో ఏటా CAT అనే పుస్తకం విడుదలవుతోంది.  ఈ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు తమ ప్రాధాన్యాన్ని అనుసరించి వివిధ విద్యాసంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి. బృంద చర్చలు, వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఆయా సంస్థలు ఎంపిక చేసుకుంటాయి.


కోర్సు వ్యవధి 
కోర్సు వ్యవధి గ్రాడ్యుయేషన్ స్థాయిలో మూడేళ్లు ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎంచుకున్న విభాగాన్ని బట్టి ఒకటి నుంచి రెండేళ్లు ఉంటుంది. ఐఎస్‌బీ లాంటి సంస్థల్లో కోర్సు వ్యవధి సంవత్సరం మాత్రమే ఉంది.

 

అవకాశాలు 
ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణల నేపథ్యంలో మేనేజ్‌మెంట్ రంగంలో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. చాలా సంస్థలు భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. అనేక భారతీయ కంపెనీలు విదేశాల్లో తమ కార్యకలాపాలను విస్తరించుకుంటున్నాయి. ఈ అంశం మేనేజ్‌మెంట్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఒక వరంగా మారింది. నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు ఈ రంగంలో లక్షల్లో ఆదాయం వచ్చే ఉద్యోగాలున్నాయి.


మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు ఉన్న వివిధ విభాగాలు:
బిజినెస్ హౌసెస్/ కార్పొరేషన్స్
మల్టీ నేషనల్ కార్పొరేషన్లు
ఇండస్ట్రియల్ హౌసెస్/ మ్యాన్యూఫ్యాక్ఛరింగ్ కంపెనీలు
మ్యాన్యూఫ్యాక్ఛరింగ్ ఆర్గనైజేషన్లు
ఫైనాన్సియల్ కన్‌సర్న్‌లు


బ్యాంకులు
పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్
అడ్వర్త్టెజింగ్ ఏజెన్సీలు
ప్రపంచ బ్యాంకు, యునిసెఫ్, ఇతర ఐక్యరాజ్యసమితి విభాగాలు.
కన్సల్టెన్సీలు/ స్వయం ఉపాధి.
బోధన/ పరిశోధన విభాగాలు.

 

ఈ కోర్సుకు ఉన్న డిమాండ్‌ను గమనించి అన్ని ప్రముఖ విద్యా సంస్థలు మేనేజ్‌మెంట్ విద్యను అందిస్తున్నాయి. వాటిలో కొన్ని....

1) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(IIM), అహ్మదాబాద్.
మన దేశంలో మేనేజ్‌మెంట్ విద్యను అందిస్తున్న, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంస్థ ఇది.
చిరునామా: ఐఐఎం,
                  వస్త్రపూర్, 
                  అహ్మదాబాద్ - 380015, 
                  గుజరాత్. 
                  ఫోన్ : +91796632356 / 26308357 
                  వెబ్‌సైట్: www.iimahd.ernet.in
                 ఐఐఎం ప్రధాన కేంద్రం అహ్మదాబాద్‌లో ఉంది. బెంగుళూరు, కోల్‌కతా, కోజికోడ్, లక్నో, ఇండోర్ లాంటి నగరాల్లో ఈ సంస్థకు శాఖలు ఉన్నాయి.

 

ఐఐఎం (IIM), బెంగుళూరు.
చిరునామా: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, 
                  బన్నెరఘట్ట రోడ్, 
                  బెంగళూరు- 56007. 
                  ఫోన్ : (+91) 80 2658250 / 26993996 
                  వెబ్‌సైట్: www.iimb.ernet.in

 

ఐఐఎం (IIM), కలకత్తా.
చిరునామా: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, 
                  డైమండ్ హార్బర్ రోడ్, 
                  జోకా, 
                  కలకత్తా- 700104, 
                  ఫోన్ : (+91) 33 24678310 / 24535037 
                  వెబ్‌సైట్: www.iimcal.ac.in

 

ఐఐఎం (IIM), కోజికోడ్.
చిరునామా: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, 
                  ఐఐఎం క్యాంపస్, 
                  కోజికోడ్, 
                  కేరళ 673570. 
                  ఫోన్ :(+91) 495 2803001 
                  వెబ్‌సైట్: www.iimK.ac.in

 

ఐఐఎం (IIM), లక్నో.
చిరునామా: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్,
                  ప్రబంధ్ నగర్, 
                  లక్నో, 
                  ఫోన్ : 0522 273410 
                  వెబ్‌సైట్: www.iiml.ac.in


ఐఐఎం (IIM), ఇండోర్.
చిరునామా: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, 
                  ఇండోర్, 
                  మధ్య ప్రదేశ్ 453331 
                  ఫోన్ : 0731  2439666 
                  వెబ్‌సైట్: www.iimidr.ac.in


2. జేవియర్స్ లేబర్ రిలేషన్ ఇన్‌స్టిట్యూట్, జంషెడ్‌పూర్.
చిరునామా: జేవియర్స్ లేబర్ రిలేషన్ ఇన్‌స్టిట్యూట్, 
                  సర్క్యూట్ హౌస్ ఏరియా (ఈస్ట్), 
                  జంషెడ్‌పూర్ 831035, 
                  జార్ఖండ్. 
                  ఫోన్ : +91 - 657 - 3983333 
                  వెబ్‌సైట్: www.xlri.ac.in

 

3. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), హైదరాబాద్. 
ఇది మన రాష్ట్రంలో మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్న ఏకైక అంతర్జాతీయ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా దీనికి 13వ ర్యాంకు ఉంది. హార్వర్డ్, టెక్సాస్, లండన్, డ్యూక్, చికాగో, స్టాన్‌ఫోర్డ్, వార్టన్, కల్లోగ్ లాంటి విశ్వవిద్యాలయాలతో కలిసి ప్రపంచస్థాయి మేనేజ్‌మెంట్ నిపుణులతో శిక్షణ అందిస్తోంది. కోర్సు వ్యవధి సంవత్సరం. దీనిలో ప్రవేశానికి గాను అభ్యర్థులకు ఏదైన రంగంలో కనీసం రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. సాధారణంగా జీమ్యాట్ (గ్యాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటుంది. ఐఎస్‌బీలో మేనేజ్‌మెంట్ విద్యనభ్యసించిన వారికి మంచి డిమాండ్ ఉంది.
చిరునామా: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, 
                  గచ్చిబౌలి, 
                  హైదరాబాద్ 500032. 
                  ఫోన్ : 04023007000 / 7099 
                  వెబ్‌సైట్: www.isb.edu

 

4. ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఢిల్లీ.
చిరునామా: ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, 
                  ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, 
                  యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ,
                  ఫోన్ : 011 - 27666382 / 6383 / 6384 
                  వెబ్‌సైట్: www.fms.edu

 

5. జమ్నాలాల్ బజాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ముంబై.
ఇది ముంబైలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన మేనేజ్‌మెంట్ విద్యాసంస్థ.
చిరునామా: జమ్నాలాల్ బజాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, 
                  హెచ్.టి. పాత్రేఖ్ మార్గ్, 
                  చర్చిగేట్, 
                  ముంబై 400020 
                  ఫోన్ : +91 022 2202133 
                  వెబ్‌సైట్: www.jbims.edu

 

6. నర్సీమోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ముంబై. 
దీని ప్రధాన కేంద్రం ముంబయిలో ఉంది. దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాల్లో విస్తరించడానికి ఏర్పాట్లు చేస్తోంది. 2011-12 విద్యా సంవత్సరం నుంచి హైదరాబాద్‌లోనూ ఒక శాఖను ప్రారంభం చేసింది.
చిరునామా: నర్సీముంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, 
                  వి.ఎల్. మెహతా రోడ్, 
                  విలే పార్లే (వెస్ట్), 
                  ముంబై 400056. 
                  ఫోన్: +91 2226134577 / 26183688 / 4235555 
                  వెబ్‌సైట్: www.nmims.edu

 

7. సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, పుణే.
చిరునామా: సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, 
                  సింబయాసిస్ నాలెడ్జ్ విలేజ్, 
                  లావలే (విలేజ్), 
                  ముల్షీ, 
                  పుణే 412115 
                  ఫోన్ : +91- 020- 39116000 / 6007 / 6008 / 6009 
                  వెబ్‌సైట్: www.sibm.edu

 

8. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, కోల్‌కతా.
చిరునామా: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, 
                  నేషనల్, 
                  కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, 
                  జాదవాపూర్ యూనివర్సిటీ, 
                  జాదవాపూర్ 700032, 
                  కలకత్తా. 
                  ఫోన్ : +91- 03324146810 / 24146219
                  వెబ్‌సైట్: www.ibmnce.in

 

9. ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, న్యూఢిల్లీ.
చిరునామా: ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, 
                  బి- 10, కుతాబ్ ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, 
                  తారా క్రిసెంట్, 
                  న్యూ ఢిల్లీ 1100016.
                  ఫోన్ : +91- 011 26863701 
                  వెబ్‌సైట్: www.imi.edu

 

10. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (IIFT).
చిరునామా: ఐఐఎఫ్‌టీ, 
                  బి- 12, కుతాబ్ ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, 
                  న్యూ ఢిల్లీ 1100016. 
                  ఫోన్ :(+91) 011 26965124 / 26965051
                  వెబ్‌సైట్: www.iift.edu

 

11. మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(MDI), గుర్‌గావ్.
చిరునామా: మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, 
                  మెహ్రౌలీ రోడ్, 
                  సుల్ఖర్లియా, 
                  గుర్‌గావ్ 122007. 
                  ఫోన్ :(+91) 124 4560000 
                  వెబ్‌సైట్: www.mdi.ac.in

 

కోర్సులు

మరిన్ని