• facebook
  • whatsapp
  • telegram

నిర్మాణాత్మ‌క కెరియ‌ర్‌కు.. నిక్మార్ కోర్సులు!

పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల

అర్హత; డిగ్రీ, ఇంజినీరింగ్ 

 

 

మనదేశంలో భవన నిర్మాణ రంగంలో కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. అత్యధిక మందికి పని కల్పించే రంగాల్లో ఇదీ ఒకటి. ఇంజినీర్లు, బిల్డర్లు, తాపీమేస్త్రీలు, కూలీలు.. ఇలా నిత్యం ఎక్కడో ఒకచోట వీరంతా పని చేస్తూనే ఉంటారు. ఎన్నో పెద్దపెద్ద కట్టడాలు, ప్రాజెక్టులు, భవనాలు మన కళ్ల ముందే రూపుదిద్దుకుంటాయి. నిర్మాణ రంగంలో ముఖ్యమైన క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, ప్రాజెక్టులకు సంబంధించిన కోర్సులను దేశంలోని పలు ఇన్‌స్టిట్యూట్లు అందిస్తున్నాయి. వీటి ద్వారా నిర్మాణాత్మక కెరియ‌ర్‌కు బాటలు వేసుకోవచ్చు. తాజాగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ మేనేజ్మెంట్ అండ్ రిసెర్చ్(నిక్మార్) పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. దేశంలోని ఐదు ప్రాంగణాల్లో మూడో రౌండ్లో ప్రవేశాలు కల్పిస్తోంది. 

 

కోర్సులు.. వ్యవధి

అడ్వాన్డ్స్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ అండ్ మేనేజ్మెంట్ (పీజీపీ-ఏసీఎం)- రెండేళ్ల కోర్సు

ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్ (పీజీపీ-పీఈఎం)- రెండేళ్ల కోర్సు

రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ మేనేజ్మెంట్ (పీజీపీ-ఆర్యూఐఎం)- రెండేళ్ల కోర్సు

ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ ఫైనాన్స్, డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ (పీజీపీ-ఐఎఫ్డీఎం)- రెండేళ్ల కోర్సు

మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ ఓన్డ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ బిజినెస్‌ (పీజీపీ-ఎంఎఫ్ఓసీబీ)- ఏడాది కోర్సు

హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ (పీజీపీ-హెచ్ఎస్ఈఎం)- ఏడాది కోర్సు

 

అర్హత

కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫైనల్ ఇయర్/  సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. 

 

ఎంపిక విధానం

నిక్మార్ కామన్అడ్మిషన్ టెస్ట్ (ఎన్‌క్యాట్‌), పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎన్‌క్యాట్‌ ను జులై 3, 4 తేదీల్లో నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి పర్సనల్ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. దీన్ని జులై 6, 7 తేదీల్లో నిర్వహిస్తారు. ఎన్‌క్యాట్‌, పర్సనల్ ఇంటర్వ్యూ రెండింటికీ అభ్యర్థులు తమ ఇంటి వద్దనుంచే హాజరు కావచ్చు. అభ్యర్థుల సౌకర్యార్థం మాదిరి పరీక్షను జులై 1న జరుపుతారు. ఫీజు కోర్సును బట్టి రూ.5 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.13 లక్షల వరకు ఉంటుంది. 

 

దరఖాస్తు తీరు

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక కోర్సుకు దరఖాస్తు చేసినట్లయితే రూ.2100 రుసుము చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ కోర్సులకు దరఖాస్తు చేస్తే రూ.2620 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులకు తుది గడువు జూన్ 29, 2021.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే అభ్యర్థులు Dean-Admissions, NICMAR, 25/1, Balewadi, N.I.A. Post Office, Pune - 411045 చిరునామాకు పంపాలి.

 

పరీక్షా విధానం 

ఎన్‌క్యాట్‌, పర్సనల్ ఇంటర్వ్యూ కలిపి మొత్తం మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ఎన్‌క్యాట్‌ 180 మార్కులకు ఉంటుంది. క్వాంటిటేటివ్ అండ్ అనలైటికల్ ఎబిలిటీ 72 మార్కులు, డేటా ఇంటర్ప్రెటేషన్36, వెర్బల్ అండ్ జనరల్ ఎబిలిటీ 72 మార్కులు కేటాయించారు. పర్సనల్ ఇంటర్వ్యూ 50 మార్కులకు, రేటింగ్ ఆఫ్ అప్లికేష‌న్‌కు 70 మార్కులు ఉంటాయి. దరఖాస్తులో సమర్పించిన ధ్రువపత్రాలు, అకడమిక్ ప్రతిభ, పని అనుభవాన్ని బట్టి రేటింగ్ ఆఫ్ అప్లికేష‌న్‌కు మార్కులు ఇస్తారు. 

 

 

సిలబస్.. ప్రిపరేషన్

క్వాంటిటేటివ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ

ఈ విభాగంలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అరిథ్మెటిక్, నంబర్ సిస్టమ్, స్కేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, సింప్లిఫికేషన్, వేరియేషన్, రేషియో అండ్ ప్రపొర్షన్, ఆవెరేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్, ప్రాఫిట్అండ్ లాస్, క్లాక్స్ అండ్ క్యాలెండర్లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. 

 

డేటా ఇంటర్ప్రెటేషన్

ఇది గణితంలో అభ్యర్థుల నాలెడ్జ్ ను అంచనా వేస్తుంది. ఇందులో టేబుల్స్, పైచార్ట్, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ముగిసిన లావాదేవీల డేటా ఆధారంగా విశ్లేషణలు చేసి కొన్ని అంశాలను, అర్థాలను, ప్రయోజనాలను రాబడతారు. ఈ సామర్థ్యం అభ్యర్థుల్లో తగినంత ఉందో లేదో ఈ పరీక్షతో నిర్ణయిస్తారు. 

 

వర్బల్ అండ్ జనరల్ ఎబిలిటీ

ఇంగ్లిష్ గ్రామర్ నియమాలు తెలిసి ఉండాలి. గ్రామర్, ఒకాబులరీ, పారా జంబుల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ కంప్లీషన్, సిననిమ్స్, యాంటనిమ్స్, వర్డ్ మీనింగ్, ఎర్రర్ డిటెక్షన్, ఎడిటింగ్ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కాంప్రహెన్షన్ ప్యాసేజీలపై సాధన చేయాలి. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై పట్టు సాధించాలి. చరిత్ర, భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంబంధ విషయాలపై దృష్టి సారించాలి. క్రమం తప్పకుండా ఆంగ్ల దినపత్రికలు చదవాలి. 

 

వెబ్‌సైట్‌: https://nicmar.ac.in/

Posted Date: 10-06-2021