చాలామంది మరిచిపోయేదీ, విజేతలు మాత్రమే గుర్తుంచుకునేదీ అయిన విషయం ఒకటుంది. అదే- ముందు తనను తాను అర్థం చేసుకోవడం; ఎదుటివారిని అర్థం చేసుకోవడం. ఈ రెండింటిపైనే మానవ సంబంధాలనేవి ఆధారపడి ఉన్నాయి.
కరోనా కారణంగా చాలామంది విదేశీ విద్యాభ్యాస ఆకాంక్షలకు అడ్డుకట్ట పడింది. విద్యార్థులతోపాటు ఉద్యోగార్థులకూ నిరాశ తప్పలేదు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నా పోటీ బాగా పెరిగిపోయింది.
సమున్నత కెరియర్ సొంతం చేసుకోవాలనే లక్ష్యంతోనే విద్యార్థులు ఉంటారు. ఆచరణలోకి వచ్చేసరికి కొంతమందే విజయవంతమవుతున్నారు. మిగిలినవారు- స్పష్టమైన లక్ష్యం లేకపోవడం, ముందస్తు ప్రణాళిక లోపించడం వల్ల విఫలమవుతున్నారు.
‘ఫలానా సమయంలో.. ఆ కెరియర్/ కోర్సును ఎంచుకుని ఉంటేనా..’ ఏదో ఒక సందర్భంలో చాలామంది అంటుంటారు. నిజానికిది అవతలి వ్యక్తి మనసులో దాచుకున్న అసంతృప్తికి నిదర్శనం. కెరియర్ నిర్ణయంపై ఇష్టంగానో, అయిష్టంగానో చాలా అంశాలు ప్రభావం చూపుతుంటాయి.
త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సైనిక స్కూళ్లను ఏర్పాటు చేసింది. సామాజిక, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను, వసతిని ఉచితంగా అందిస్తారు.
ఒక ఆట గెలవాలంటే ప్రత్యర్థి బలాలను తెలుసుకోవాలంటారు పెద్దలు. ఇక్కడ మన బలహీనత ఎదుటివారికి తెలియకుండా జాగ్రత్తపడితే చాలు. కెరియర్ గేమ్‌లో విజయం దక్కాలంటే మాత్రం సొంత బలాలూ, బలహీనతలూ తెలుసుకుని ఉండాలి. నేటితరంలో..
మిస్టరీలను ఛేదించే ఉద్యోగంలో మీరు చేరాలంటే ఏం చదవాలో చూడండి!
యానిమేషన్, పెయింటింగ్, ఫొటోగ్రపీ, స్కల్ప్చర్ ఇవన్నీ ఫైన్ ఆర్ట్స్ విభాగంలోకి వస్తాయి.
పరిశోధనే వృత్తిగా మార్చుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలనుకునే వారికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) చక్కటి వేదిక. ఇక్కడ నిత్యం సమాజ హితానికి తోడ్పడే బేసిక్ సైన్స్‌లో పరిశోధనలు జరుగుతాయి.
ఏదైనా కొత్త ఆవిష్కరణ జరిగిందంటే దానికి మూలం సైన్స్. అలాగే దాని వెనక ఎంతోమంది శాస్త్రవేత్తల నిరంతర కృషి, పట్టుదల ఉంటుంది. మనదేశానికి చెందినఎంతోమంది శాస్త్రజ్ఞులు ప్రపంచస్థాయిలో చెరగని ముద్ర వేసుకున్నారు.
ఆహ్లాదకరమైన వాతావరణం.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యాబోధన.. విద్యార్థులకు అవసరమైన ఆధునిక హంగులతో సౌకర్యాలు.. ఉన్నత విద్యనభ్యసించడానికి క్యాంపస్‌లో ఇంతకంటే ఏం కావాలి? ఇలాంటి సదుపాయాలన్నీ హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సంస్థలో ఉన్నాయి.
దేశంలో పర్యాటక రంగం విస్తరిస్తోంది. ఇందులో సేవలు అందించడానికి నాణ్యమైన మానవ వనరులను తయారుచేసే నిమిత్తం నెల్లూరు, గ్వాలియర్, భువనేశ్వర్, నోయిడా, గోవాల్లో ఐఐటీటీఎంలను ఏర్పాటు చేశారు.
కరోనా సంక్షోభం తర్వాత పుంజుకున్న తొలి రంగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ప్రత్యేకత చూపింది.
యాక్చూరియల్ సైన్స్.. అతి కొద్ది మందికే తెలిసిన కోర్సుల్లో ఇదీ ఒకటి. గత అనుభవాలు, వర్తమాన పరిస్థితుల ఆధారంగా అంచనాలను జోడించి రాబోయే ఆర్థిక చిత్రాన్ని విశ్లేషించేవారే యాక్చురీలు (గణకులు). దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ వీరికి చాలా డిమాండ్ ఉంది.