విదేశాల్లో వైద్యవిద్యకు వెళ్లాలా.. వద్దా?
నీట్ ముగిసింది. ఆశించిన సీటు రాలేదు. ఇక ఎంబీబీఎస్ చేసి డాక్టర్ కావాలనే కల అలాగే మిగిలిపోవాలా? అంత నిరాశ అవసరం లేదంటున్నారు నిపుణులు. నీట్ లో అర్హత సాధించి, కొన్ని జాగ్రత్తలు తీసుకొని, కాస్త ఖర్చు పెట్టుకోగలిగితే కలను సాకారం చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతానికి అడ్మిషన్ తీసుకున్న అభ్యర్థులు ఆన్ లైన్ తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది. కరోనా పరిస్థితులు చక్కబడగానే ఆయా సంస్థలకు వెళ్లి కోర్సును కొనసాగించవచ్చు.