It isn't far off 

We have seen earlier that 'much' (= a large amount of) and many (a large number of) are used, only with not, in questions and in comparatives. ఇంతకు ముందు మనం చూశాం కదా: much, many లను, ఎక్కువ లేదు అని not తో/ questions లో/ Comparative degree లో మాత్రమే వాడతామని, affirmative sentences లో ఉపయోగించమని. ఇప్పుడు 'దూరం' గురించి చూద్దాం..
Basheer: How far are you going? (ఎందాక వెళ్తున్నావు?- How far అసలర్థం - ఎంత దూరం?)
Chakri: Not very far. But why are you asking? (ఇక్కడికే. ఏం? -Why are you asking? అసలర్థం, ఎందుకడుగుతున్నావు?)
Basheer: If it is somewhere a long way off, I can give you a lift. I am going the same way. (ఎక్కడికైనా చాలాదూరం అయితే, నేను నీకు lift ఇస్తాను. నేను అటువైపే వెళ్తున్నాను.)
Chakri: So good of you. It isn't far off. Just walking distance. I prefer to walk. (Thanks. అదేం అంతదూరం కాదు. నడవగలిగినంత దూరమే.)
Basheer: What happened to your bike? (నీ bike ఏమయ్యింది?)
Chakri: On my way back from a camp, it broke down on the way. It is at the mechanic's.
It's a major trouble. (Camp నుంచి తిరిగి వస్తుండగా అది ఆగిపోయింది. అదిప్పుడు మెకానిక్ దగ్గర ఉంది. అది కొంచెం పెద్ద రిపేరే).
Basheer: When was this? (అదెప్పుడు?)
Chakri: Not so long ago - the day before yesterday. (ఎంతోకాలం అవలేదు. మొన్ననే.)
Basheer: It's an old bike, time you changed it, isn't it? (అది పాత bike. ఎప్పుడో మార్చుండాల్సింది దాన్ని.)
Chakri: It isn't as old as you seem to think. Still I think I had better change it. The day isn't far off when you will see me on a new one (నువ్వు అనుకుంటున్నంత పాతదేం కాదది. అయినా అది మార్చడమే మంచిదనుకుంటున్నా. నువ్వు నన్ను కొత్త bike మీద చూసే రోజు ఎంతో దూరం లేదు.)
Basheer: The sooner you do it the better. You can save on the repairs. (నువ్వది ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. రిపేర్ల మీద పెట్టే డబ్బు ఆదా అవుతుంది.)
                                                                                    ¤   ¤   ¤
Look at the following expressions from the conversation above:
1. Not very far.
2. If it somewhere a long way off....
3. It isn't far off (It is not far off)
4. Not so long ago
5. The day isn't far off.
Spoken English లో far (దూరమైన = distant)ను 'not' తో లేదా (దూరం కాదు అనే అర్థంతో) question లో మాత్రమే వాడతాం. (far కి comparative- farther, superlative - farthest). అలాగే 'distant' (దూరమైన) అనడానికి బదులు ఎక్కువగా a long way/ a long way off/ a long way away ఉపయోగిస్తారు.  
a) Hemanth: How far is the railway station? Have I to go a long way?
Krishna: Not far off. It's just a kilometer from here, a little farther off from the Post Office there. (దూరమేం కాదు. ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరం. పోస్టాఫీసుకు కొద్దిగా అవతల.)
b) Kolkata is a long way off from Hyderabad (హైదరాబాద్ నుంచి కోల్‌కతాకు చాలా దూరం.)
c) Dinesh: Excuse me. Which bus should I take to Ameerpet crossroads? (అమీర్‌పేట చౌరస్తాకు ఏ బస్ ఎక్కాలి?)
Ganesh: No need to take a bus. It isn't far off. You can walk the distance. Go straight for half a kilometer and you are there. (బస్ అవసరం లేదు. అదంత దూరం కాదు. మీరా దూరం నడవచ్చు. తిన్నగా అరకిలోమీటర్ నడవండి, మీరక్కడ ఉంటారు.)
Important points: far/ far off/ far from - వీటికి అర్థం, దూరమైన అని. అయితే వీటిని not తో (దూరం కాదు అనే అర్థంతో)/ questions లో మాత్రమే ఉపయోగిస్తాం. దూరం అనేందుకు ఎక్కువగా 'a long way off' అని వాడతాం distant కి బదులు. Distant వాడటం తప్పుకాదు.


Whoever told you so? 

Spoken English లో మనం అడగాలనుకున్న, చెప్పాలనుకున్న వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, మిగతా వాటికి తక్కువ ప్రాధాన్యం  ఇవ్వడానికి, sentence లోని కొన్ని మాటలను నొక్కి పలుకుతాం, ఇతర మాటలను మామూలుగా పలుకుతాం. అలా నొక్కి పలకడాన్ని, తక్కువ శక్తితో పలకడాన్ని Intonation అంటారు.
¤ Kumar sells books (కుమార్ పుస్తకాలు అమ్ముతాడు). Suppose you want to give importance to Kumar. Then you say 'Kumar' with greater force than you say the other words.
¤ Kumar sells books (కుమార్ - ఇంకెవరో కాదు - పుస్తకాలు అమ్ముతాడు).
¤ Kumar sells books (కుమార్ పుస్తకాలు అమ్ముతాడు)
¤ Kumar sells books (కుమార్ పుస్తకాలు అమ్ముతాడు - ఇంకేదో చేయడు) అలాగే Questions లో కూడా.
¤ Who will do this? (ఇదెవరు చేస్తారు - మనం తెలుసుకోవాలనుకునేది, ఎవరు? - అందుకని The stress is on 'who').
¤ Who will do this? (ఇదెవరు చేస్తారు?) (ఇక్కడ మనకు ముఖ్యం, ఈ పనిని (ఎవరు చేస్తారు?) అది సరే, నేను చేస్తాను, ఇదెవరు చేస్తారు అని).
ఇలా కొన్ని విషయాలకు ప్రాముఖ్యం ఇవ్వడానికి కొన్నికొన్ని పదాలను వాడతాం English లో. అవేంటో కింద చూడండి.
Compare: a) Who told you so? (నీకెవరు చెప్పారు అలా?)
 

b) Whoever told you so? ఎవరది నీకు చెప్పింది? - కోపంతో గానీ, విసుగుతో కానీ, చెప్పిందెవరో తెలుసుకునేందుకు who బదులు, Whoever అంటాం.
ఇది కూడా చూడండి:
a) He does anything badly. (ఏదైనా సరిగా చేయడతడు.)
b) Whatever he does, he does badly అతడేది చేసినా, సరిగా చేయడు - ఇది విసుగుతో/ కోపంతో అనడం.
ఇలాంటివి మన Spoken English లో భాగమై పోయి వాడుకగా మాట్లాడేయాలి. అప్పుడే మన Spoken English బాగుంటుంది.