* విద్యార్థుల నుంచి భారీగా వినతులు
* కేంద్ర సర్కారు సానుకూల సంకేతాలు
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వైద్యవిద్యకు సంబంధించిన ఎంబీబీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశానికి ఈసారి నీట్‌ను రెండు సార్లు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కరోనా పరిసితుల నేపథ్యంలో పరీక్షను రెండుసార్లు జరపాలని భారీ సంఖ్యలో విద్యార్థుల నుంచి ప్రతిపాదనలు కేంద్ర విద్యాశాఖకు అందాయి. అలా చేస్తే విద్యార్థులపై కాస్త ఒత్తిడి తగ్గుతుందని నిపుణులూ భావిస్తున్నారు. విద్యార్థులు ఒకసారి పరీక్ష రాసే పరిసితుల్లో లేకున్నా.. తొలిసారి సరిగా రాయలేకున్నా రెండోసారి అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని కేంద్రమూ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెండుసార్లు నీట్ నిర్వహణకు ఉన్న అవకాశాలను పరిశీలించి ఆమోదం తెలపాలని కోరుతూ ఇటీవల జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) కేంద్ర వైద్యశాఖకు లేఖ రాయడం గమనార్హం. ఇప్పటికే దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ సానుకూల సంకేతాలు ఇవ్వడంతో కచ్చితంగా రెండుసార్లు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.
రెండేళ్లుగా ప్రతిపాదన
నీట్‌ను రెండుసార్లు నిర్వహించాలని గత రెండేళ్లుగా ప్రతిపాదన ఉంది. దీన్ని కూడా జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ ఇతర పరీక్షల మాదిరిగా ఆన్లైన్లో ఎందుకు జరపరాదన్న చర్చ సాగింది. అయినా.. తక్కువ సీట్లు ఉండటం, నీట్‌ను దాదాపు 15లక్షల మంది రాస్తుండటంతో పాటు ఆన్లైన్లో నిర్వహిస్తే ఒకే స్థాయిలో ప్రశ్నపత్రం ఉండకపోతే సమస్య రావచ్చని కేంద్రం అందుకు అంగీకరించలేదు. అందరికీ ఒకే ప్రశ్నపత్రం ఉండేలా ఆఫ్‌లైన్(పెన్ను-పేపర్) విధానంలోనే పరీక్ష జరుపుతున్నారు.
స్టడీమెటీరియల్ |
జీవశాస్త్రం |
రసాయనశాస్త్రం |
భౌతిక శాస్త్రం |