ఈనాడు, హైదరాబాద్: ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌లో తొలి విడత సీట్లను జనవరి 15న కేటాయించారు. కన్వీనర్ కోటాలో 13,510 సీట్లకు 18,870 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. అందులో 10,265 మంది సీట్లు పొందారు. వీరు ఫీజు చెల్లించి జనవరి 18-22 తేదీల మధ్య కళాశాలల్లో అసలు ధ్రువపత్రాలను సమర్పించి చేరాలని ఎడ్‌సెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య పి.రమేష్‌బాబు తెలిపారు. జనవరి 21వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
బీఈడీలో 10,265 సీట్ల భర్తీ
Posted Date : 16-01-2021 .