ఈనాడు, కరీంనగర్: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో 2020-21 వైద్యవిద్య సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్యవిద్య కోర్సుల్లో యాజమాన్య(బి), ప్రవాస భారతీయ(సి) కోటాల్లో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నవంబరు 30న ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రవేశాల కోసం డిసెంబరు 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నీట్ యూజీ-2020లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో చూడాలని సూచించింది.
యాజమాన్య కోటా వైద్యవిద్య ప్రవేశాలు ప్రారంభం
Posted Date : 01-12-2020 .