కౌడిపల్లి, న్యూస్టుడే: సార్వత్రిక విద్య 2020-21 విద్యా సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ మొదలవగా ఇప్పటి వరకు 3,026 మంది అభ్యాసకులు ప్రవేశాలు పొందారని సార్వత్రిక విద్య ఉమ్మడి జిల్లా సమన్వయకర్త ఎస్.వెంకటస్వామి తెలిపారు. జనవరి 12న కౌడిపల్లి ఉన్నత పాఠశాలలోని అధ్యయన కేంద్రంలో ప్రవేశాలకు సంబంధించిన గోడపత్రికను విడుదల చేసి కొత్తగా ఇద్దరికి ప్రవేశాలు కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో 104 అధ్యయన కేంద్రాలు ఉన్నాయని, 14 ఏళ్లు నిండిన వారు పదో తరగతిలో, 15 సంవత్సరాలు నిండిన వారు ఇంటర్లో చేరవచ్చని సూచించారు. 2019-20 విద్యా సంవత్సరంలో 8,830 మంది ప్రవేశాలు పొందారని గుర్తుచేశారు. జనవరి 15 వరకు చేరవచ్చని, గడువు సైతం పెరిగే అవకాశం ఉందన్నారు. స్థానిక అధ్యయన కేంద్రం సహాయ సమన్వయకర్త రాధాకిషన్, తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక విద్యలో 3026 మందికి ప్రవేశాలు
Posted Date : 13-01-2021 .