ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 2020-21 విద్యాసంవత్సరానికి పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి కాళోజీ ఆరోగ్య వర్సిటీ ప్రకటన విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి జనవరి 18 నుంచి 27 వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ కోరింది.
పారా మెడికల్ కోర్సుల ప్రవేశానికి ప్రకటన
Posted Date : 18-01-2021 .