• facebook
  • whatsapp
  • telegram

బీడీఎస్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌ ఫలితాలు విడుద‌ల‌


 

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఈ ఏడాది ఏప్రిల్‌/మే నెలల్లో జరిగిన మొదటి సంవత్సరం బీడీఎస్‌ పరీక్షల ఫలితాలను విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం జూన్ 09న‌ వెల్లడించింది. రీటోటలింగ్‌ కోరే అభ్యర్థులు సబ్జెక్టుకు రూ.రెండు వేలు రిజిస్ట్రార్‌ పేరిట చెల్లించి జూన్‌ 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పి.దుర్గాప్రసాదరావు తెలిపారు. ఫలితాలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.

Posted Date : 10-06-2021