• facebook
  • whatsapp
  • telegram

ఏపీలో 7వ త‌ర‌గ‌తి నుంచి సీబీఎస్ఈ విధానం

 

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌తన భేటీ అయిన ఏపీ కేబినేట్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 7వ త‌ర‌గ‌తి నుంచి సీబీఎస్‌ఈ ద్వారా విద్యా బోధన చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానంలో చదువుకుని పరీక్ష రాయ‌నున్నారు. ఈమేర‌కు రాష్ట్రంలోని 44,639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానం అమలు చేయాల‌ని కేబినేట్ నిర్ణ‌యించింది. అలాగే 2018-19 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 52,23,000 విద్యార్థులు ఉంటే, 2020-21 సంవత్సరానికి ఆ సంఖ్య 59,30,000 చేరింది. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. 

Posted Date : 04-05-2021