ఈనాడు, అమరావతి: ట్రిపుల్ఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు జనవరి 18 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని, అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని కులపతి కేసీ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్టీ కేటగిరీలో శ్రీకాకుళం ప్రాంగణంలో 9 సీట్లు మిగిలిపోయాయి. వీటిల్లో ఆంధ్ర రీజియన్‌కు సంబంధించి 2, శ్రీవేంకటేశ్వర రీజియన్ సంబంధించి 7 ఖాళీగా ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 20వేల ర్యాంకుల వరకు పిలిచినా సీట్లు భర్తీ కాలేదు. మిగిలిన 9 సీట్లకు మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. దివ్యాంగులు, క్రీడా, మాజీ సైనికోద్యోగులు, ఎన్సీసీ కోటా కింద 257 సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. ఈ ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కానున్నందున పెండింగ్‌లో పెట్టారు. ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి మొత్తం 4,400 సీట్లు భర్తీ కావాల్సి ఉండగా 4,134 సీట్లు నిండాయి.
జనవరి 18 నుంచి ట్రిపుల్ఐటీల్లో తరగతులు
Posted Date : 17-01-2021