చౌటుప్పల్, న్యూస్‌టుడే: తెలంగాణ వ్యాయామ విద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీఈసెట్)-2020ను రాష్ట్రంలోని 16 కేంద్రాల్లో నవంబరు 7న నిర్వహిస్తున్నట్లు పీఈసెట్ కన్వీనర్ ఆచార్య వి.సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో బీపీఎడ్, డీపీఎడ్ ప్రవేశ పరీక్షకు 7,800 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో 16 కేంద్రాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుదారులకు హైజంప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, పరుగు పందాలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా ర్యాంకుల కేటాయిస్తామన్నారు. కరోనా ఉన్న వారు పోటీల్లో పాల్గొనరాదని పేర్కొన్నారు.
7న పీఈసెట్ పోటీలు
Posted Date : 07-11-2020 .