విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే: ప్రభుత్వ ఐటీఐల్లో రెండో విడత ప్రవేశాలకు నవంబరు 20న కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో విజయనగరంతో పాటు బొబ్బిలి, భద్రగిరి, సాలూరు ఐటీఐల్లో కౌన్సెలింగ్ ఆధారంగా అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో సాంకేతిక సమస్యతో సర్వర్ పనిచేయక ఉదయం కౌన్సెలింగ్ జరగలేదు. మధ్యాహ్నం కౌన్సెలింగ్ నిర్వహించారు. 268 మందికి 180 మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ ఐటీఐల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
Posted Date : 21-11-2020 .