ఈనాడు, హైదరాబాద్: భారతీయ విద్యార్థుల కోసం నవంబరు 25 నుంచి 27వ తేదీ వరకు యూరోపియన్ యూనియన్(ఈయూ) ఆన్లైన్ విదేశీ విద్యా ప్రదర్శన- భారత్ 2020 జరగనుంది. ఈయూలోని 21 దేశాలకు చెందిన 80 విద్యాసంస్థలు పాల్గొననున్నాయి. ఇప్పటికే 26 వేల మందికి పైగా విద్యార్థులు వెబినార్లో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ప్రత్యేక వెబ్ పోర్టల్ www.study-europe.net ద్వారా తెలుసుకోవచ్చు. పాల్గొనాలంటే ఉచితంగా రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయా వర్సిటీల ప్రతినిధులతో మాట్లాడి కరోనా సమయంలో ప్రవేశాలు తదితరాలపై సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
25 నుంచి ఈయూ విదేశీ విద్యా ప్రదర్శన
Posted Date : 21-11-2020 .