• facebook
  • whatsapp
  • telegram

ఎనిమిదో త‌ర‌గతి విద్యార్థుల‌కు బ‌డులు పునఃప్రారంభం

* నవంబ‌రు 23 నుంచి పాఠాలు షురూ
* డిసెంబరు 14 నుంచి 6, 7 తరగతులకూ
* ప్రక‌టించిన మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 6, 7, 8 తరగతులకు బడులు పునఃప్రారంభంపై ప్రభుత్వం మార్పులు చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం నవంబ‌రు 23  నుంచి 6, 7, 8 విద్యార్థులకు తరగతులు నిర్వహించాల్సి ఉంది. కానీ, 6, 7 తరగతుల ప్రారంభాన్ని డిసెంబరు 14కు వాయిదా వేస్తూ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. డిసెంబరు 14 నుంచి 1-5 తరగతులను ప్రారంభించాల్సి ఉండగా.. సంక్రాంతి పండుగ అనంతరం తరగతులు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న‌వంబ‌రు 23 నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే న‌వంబ‌రు 2 నుంచి 9, 10 విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.45గంటల వరకు కొనసాగుతున్న పాఠశాలలను చలి కారణంగా ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చామని ఆయ‌న పేర్కొన్నారు.

Posted Date : 22-11-2020 .