• facebook
  • whatsapp
  • telegram

ఫార్మా సీట్ల‌కు 13,552 మంది పోటీ

ఈనాడు, హైద‌రాబాద్‌: బీఫార్మ‌సీ, ఫార్మా-డి, బీటెక్ బ‌యోటెక్నాల‌జీ సీట్ల కోసం ఎంసెట్ బైపీసీ విద్యార్థులు  13,532 మంది పోటీ ప‌డ‌నున్నారు. ధ్రువ ప‌త్రాల ప‌రిశీల‌న న‌వంబ‌రు 21న ముగిసింది. మొత్తం 14,859 మంది స్లాట్లు బుక్ చేసుకున్నా వారిలో 13,532 మంది విద్యార్థులు మాత్ర‌మే ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌కు ముందుకొచ్చారు. వారు వెబ్ ఆప్ష‌న్లు ఇచ్చుకునేందుకు న‌వంబ‌రు 22 వ‌ర‌కు గ‌డువు ఉంది. మూడు కోర్సుల్లో క‌లిపి దాదాపు 8 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Posted Date : 22-11-2020 .