‣ 8వ తరగతి క్లాసులు ప్రారంభం
ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభించిన తొలిరోజే 69.72 శాతం మంది తరగతులకు హాజరయ్యారని మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 8వ తరగతి విద్యార్థులు 5.70 లక్షల మంది ఉండగా.. 3.96 లక్షల మంది పాఠశాలలకు వచ్చారని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 82.34 శాతం, విశాఖలో అత్యల్పంగా 53.14 శాతం మంది హాజరయ్యారని వెల్లడించారు. పదోతరగతి విద్యార్థులు 46.28 శాతం, 9వ తరగతి విద్యార్థులు 41.61 శాతం బడులకు వచ్చారని తెలిపారు. డిసెంబరు 14 తర్వాత 6, 7 తరగతులను పునఃప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు.