ఈనాడు, హైదరాబాద్: బీఫార్మసీ, ఫార్మా - డి, బయోటెక్నాలజీ కోర్సుల్లో సీట్లన్నీ మొదటి దశ కౌన్సెలింగ్లో భర్తీ చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ నవంబరు 24న ఒక ప్రకటనలో తెలిపారు. నవంబరు 20, 21 తేదీల్లో అర్హత ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 14,156 మంది హాజరవ్వగా వీరిలో 13,309 మంది కళాశాలలకు ఆప్షన్లు ఇచ్చారు. మొత్తం అన్ని కాలేజీల్లో కలిపి 7,844 సీట్లుండగా ర్యాంకుల వారీగా అర్హులకు కేటాయించారు. నవంబరు 27లోగా రుసుం చెల్లించి కోర్సులో చేరుతున్నట్లు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఈ గడువులోగా చేరనివారి సీటు రద్దవుతుందని మిత్తల్ చెప్పారు.
బీఫార్మసీ, బయోటెక్నాలజీ సీట్లు భర్తీ
Posted Date : 25-11-2020 .