ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ పీజీఈసెట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల అప్లోడ్, పరిశీలన ప్రక్రియ గడువును నవంబరు 30వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రవేశాల కన్వీనర్ ఆచార్య పి.రమేష్‌బాబు తెలిపారు. ఎంటెక్, ఎంఫార్మసీ సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్లు ప్రారంభించడానికి బీటెక్, బీఫార్మసీ ధ్రువపత్రాలు అవసరం. విశ్వవిద్యాలయాలు వాటిని జారీ చేయడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ధ్రువపత్రాలను అప్లోడ్ చేయడానికి ఉన్న గడువును 30వ తేదీ వరకు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు డిసెంబరు 3, 4వ తేదీల్లో ఇచ్చుకోవాల్సి ఉంటుందని, 7న సీట్లు కేటాయిస్తామని, 14వ తేదీ నుంచి ఎంటెక్, ఎంఫార్మసీ తరగతులు మొదలవుతాయని ఆయన తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్ కాలపట్టికను తర్వాత ప్రకటిస్తామన్నారు. నవంబరు 25వ తేదీ వరకు దాదాపు 7 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
పీజీఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన గడువు పెంపు
Posted Date : 26-11-2020 .