మాచవరం, న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో కొండపల్లి ఇండస్ట్రీలో పలు అంశాల్లో ఉచిత శిక్షణ, భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.ప్రణయ్ తెలిపారు. ‘ఆర్చ్ లాబొరేటరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’లో ఈ శిక్షణ ఇస్తామన్నారు. రెండు వారాల శిక్షణ ముగిసిన తర్వాత ఉపాధి కల్పిస్తామని వివరించారు. బీఎస్సీ (కెమిస్ట్రీ)/ఏదైనా మూడేళ్ల డిగ్రీ, ఎమ్మెస్సీ (కెమెస్ట్రీ), ఐటీఐ/పాలిటెక్నిక్ పూర్తి చేసి 30 సంవత్సరాల్లోపు ఉన్న యువకులు అర్హులన్నారు. ఆసక్తిగల యువకులు డిసెంబరు 6వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 18004252422 లేదా ఫోన్ 63050 04318 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.
ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, ఉపాధి
Posted Date : 27-11-2020 .