ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడు విశ్వవిద్యాలయాల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి డిసెంబరు 2 నుంచి మొదలయ్యే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్)కు 85,262 మంది పోటీపడనున్నారు. గత ఏడాదికంటే ఈసారి సుమారు 6,000 దరఖాస్తులు తగ్గాయి. ముఖ్యంగా ఉత్తరభారతం నుంచి ఏటా 5,000 మంది వరకు దరఖాస్తు చేసేవారు. ఈసారి 665 మందే ముందుకొచ్చారని, కరోనాతో రవాణా సదుపాయాల సమస్యే కారణమని సీపీగెట్ కన్వీనర్ ఆచార్య కిషన్ తెలిపారు. రోజుకు 3 విడతల చొప్పున 10 రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. హైదరాబాద్‌తోపాటు పాత జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల మధ్య 2గంటల వ్యవధి ఉన్నందున ఆ సమయంలో పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేస్తారు. సీట్ల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చినందున ఎంఏ కన్నడ, మరాఠీ, పర్షియన్ సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించడం లేదు.
డిసెంబరు 2 నుంచి సీపీగెట్ ఆన్లైన్ పరీక్షలు
Posted Date : 27-11-2020 .