• facebook
  • whatsapp
  • telegram

ఇంటిగ్రేటెడ్‌ కోర్సు విద్యార్థులూ.. ఉపాధ్యాయ కొలువులకు అర్హులే

ఈనాడు, హైదరాబాద్‌: బీఈడీ-ఎంఈడీ మూడేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులూ ఉపాధ్యాయ కొలువులకు పోటీపడవచ్చు. ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) సర్వసభ్య సమావేశం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనిపై కొన్ని రాష్ట్రాల్లో వివాదం తలెత్తడంతో నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ సిఫారసులను ఆమోదించిన ఎన్‌సీటీఈ.. మూడేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పూర్తి చేసిన వారు టెట్‌ రాసి టీఆర్‌టీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీపడవచ్చని పేర్కొంది. రాష్ట్రంలో బీఈడీ- ఎంఈడీ ఇంటిగ్రేటెడ్‌ సీట్లు ప్రస్తుతం లేవు.

Posted Date : 15-01-2021 .