• facebook
  • whatsapp
  • telegram

పదో తరగతి పరీక్షలు మే 20 నుంచి!

 

ఈనాడు - హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షల్ని మే 20 నుంచి నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇంట‌ర్‌మీడియ‌ట్ ప్ర‌ధాన సబ్జెక్టుల పరీక్షలు మే 19వ తేదీకి పూర్తవుతాయి. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలను మే 20 నుంచి ప్రారంభించి 29వ తేదీతో పూర్తి చేయాలని భావిస్తున్నారు.

మేలో అధిక ఎండల కారణంగా విద్యార్థులకు సమస్య అవుతుందని ప్రభుత్వం భావిస్తే జూన్మొదటి వారంలో ప్రారంభించేందుకు అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.

ఇప్పటివరకు 6 సబ్జెక్టులకు 11 పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఈసారి సబ్జెక్టుకు ఒక పరీక్ష చొప్పున ఆరు పరీక్షలే ఉంటాయని సమాచారం. అంతర్గత పరీక్షలు(ఎఫ్ఏ) నాలుగుకు బదులు రెండు ఉంటాయని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం జీఓ జారీ చేయాల్సి ఉంటుంది.

70 శాతం సిలబస్నుంచే ప్రశ్నపత్రాలను రూపొందించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్ఎస్సీ బోర్డు), రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) కసరత్తు చేస్తున్నాయి. సబ్జెక్టు నిపుణులను ఆహ్వానించి చర్చిస్తున్నారు.

Posted Date : 22-01-2021 .