• facebook
  • whatsapp
  • telegram

గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎస్సీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని 33, ఎస్టీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని 17 ప్రతిభా కళాశాలల్లో వచ్చే విద్యాసంవత్సరానికి ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును జ‌న‌వరి 20 వరకు పొడిగించినట్లు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఎస్సీ సొసైటీ పరిధిలోని కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సులు, ఎస్టీ సొసైటీ పరిధిలో ఎంపీసీ, బైపీసీ కోర్సులు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్‌తో పాటు ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్‌, క్లాట్‌, సీఎంఏ తదితర పోటీ పరీక్షలకు ఈ కళాశాలల్లో శిక్షణ ఉంటుందని వివరించారు. పూర్తి వివరాలకు 1800 4254 5678, 9121174434, 9121333472 టోల్‌ఫ్రీ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Posted Date : 12-01-2021 .