• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ పాలిసెట్‌-2021 దరఖాస్తు గడువు పెంపు

 

హైదరాబాద్‌: తెలంగాణలో పాలిసెట్‌-2021 ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్టు కార్యదర్శి శ్రీనాథ్‌ తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా  జూన్‌ 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. రూ.100 ఆలస్య రుసుముతో జూన్‌ 20 వరకు, రూ.300 ఆలస్య రుసుముతో జూన్‌ 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. పాలిసెట్‌ తేదీని త్వరలో ప్రకటిస్తామని, పరీక్ష నిర్వహించిన పది రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని శ్రీనాథ్‌ వెల్లడించారు.

Posted Date : 11-06-2021