• facebook
  • whatsapp
  • telegram

ఫిబ్రవరి 22, 27న‌ జీప్యాట్‌, సీమ్యాట్‌

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలైన గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(జీప్యాట్‌), కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(సీమ్యాట్‌) వచ్చే ఫిబ్రవరి 22, 27వ తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. ఈ మేరకు జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) నోటిఫికేషన్లు జారీ చేసింది. జాతీయ ఫార్మసీ విద్య, పరిశోధనా సంస్థ(నైపర్‌)ల్లో ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి జీప్యాట్‌, మేనేజ్‌మెంట్‌ కళాశాలలు, సంస్థల్లో ఎంబీఏ/పీజీడీఎం కోర్సుల్లో చేరేందుకు సీమ్యాట్‌ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు జనవరి 22 తుది గడువుగా నిర్ణయించారు. తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

Posted Date : 24-12-2020 .