• facebook
  • whatsapp
  • telegram

ఐసీఎస్ఐ జూన్-2021 ప‌రీక్ష‌లు వాయిదా

క‌రోనా సంక్షోభం నేప‌థ్యంలో విద్యార్థుల ర‌క్ష‌ణ‌ను దృష్టిలో పెట్టుకొని జూన్‌-2021 ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్ర‌ట‌రీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) ప్ర‌క‌టించింది. ఈమేర‌కు ఫౌండేష‌న్ ప్రోగ్రామ్‌, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెష‌న‌ల్ ప్రోగ్రామ్ (పాత‌, కొత్త సిల‌బ‌స్‌) ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది. షెడ్యూలు ప్ర‌కారం ఈ ప‌రీక్ష‌లు జూన్ 1 నుంచి 10 జ‌ర‌గాల్సి ఉన్నాయి. త‌దుప‌రి తేదీల‌ను ప‌రీక్ష‌ల‌కు క‌నీసం నెల రోజుల ముందు ప్ర‌క‌టిస్తామ‌ని ఐసీఎస్ఐ తెలిపింది. 

Posted Date : 04-05-2021