• facebook
  • whatsapp
  • telegram

మే 31వరకు ఇంటర్‌ మొదటి ఏడాది తరగతులు   

* రెండో శనివారం, వేసవి సెలవులు రద్దు

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం తరగతులు మే 31వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ విద్యామండలి ప్రకటించింది. సవరించిన మొదటి ఏడాది అకడమిక్‌ కేలండర్‌ను జ‌న‌వ‌రి 15న‌ విడుదల చేసింది. జ‌న‌వ‌రి 18 నుంచి ప్రారంభమయ్యే తరగతులు మొత్తం 106 రోజులు జరగనున్నాయి. రెండో శనివారం, వేసవి సెలవులను రద్దు చేశారు. అర్ధ సంవత్సరం పరీక్షలు మార్చి 25 నుంచి 31వరకు నిర్వహిస్తారు. ప్రీఫైనల్‌, బోర్డు థియరీ పరీక్షలను ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహిస్తారు.

Posted Date : 16-01-2021 .