ఈనాడు, హైదరాబాద్: జేఈఈ మెయిన్ మొదటి విడతకు దరఖాస్తు గడువును జనవరి 23వరకు పెంచుతున్నట్లు జాతీయపరీక్షల మండలి జనవరి 16న ప్రకటించింది. 2021-22 నుంచి యూపీలోని గోరఖ్‌పూర్‌లో మదన్మోహన్ మాలవ్య సాంకేతిక విశ్వవిద్యాలయం కూడా జేఈఈ మెయిన్ ర్యాంకుల ద్వారా ప్రవేశాలు కల్పించేందుకు ముందుకొచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రకటించిన కాలపట్టిక ప్రకారం జనవరి 16తో గడువు ముగిసింది. దరఖాస్తుల్లోని పొరపాట్లను జనవరి 27 నుంచి 30 వరకు సవరించుకోవచ్చని, ఫిబ్రవరి 2వ వారం నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ పేర్కొంది.
జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పెంపు
Posted Date : 17-01-2021 .