• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ మెయిన్స్-2021 మే సెష‌న్ ప‌రీక్ష వాయిదా

దేశంలో క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్ర‌క‌టించింది. ఈమేర‌కు కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ ట్విట‌ర్‌లో వెల్ల‌డించారు. ఈఏడాది జేఈఈ ప‌రీక్ష‌ల‌ను నాలుగు విడ‌త‌లుగా నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే షెడ్యూల ప్ర‌కారం ఈనెల 24 నుంచి 28 వ‌ర‌కు మే సెష‌న్ ప‌రీక్ష‌లు జ‌ర‌గాల్సి ఉన్నాయి. దేశంలో తాజా ప‌రిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్న‌ట్లు ఎన్‌టీఏ తెలిపింది. మ‌రోవైపు గ‌త నెలలో జ‌ర‌గాల్సిన ఏప్రిల్ సెష‌న్ ప‌రీక్ష‌లు కూడా ఇప్ప‌టికే వాయిదా ప‌డ్డాయి. త‌దుప‌రి తేదీల‌ను  త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని ఎన్‌టీఏ పేర్కొంది. అప్ప‌టివ‌ర‌కు విద్యార్థులు త‌మ విలువైన స‌మ‌యాన్ని వృథా చేసుకోకుండా ఎన్‌టీఏ అభ్యాస్ యాప్ ద్వారా ఇంటివ‌ద్దే ఉండి ప‌రీక్ష‌ల‌కు సిద్ధం కావాల‌ని సూచించింది. 


 

Posted Date : 04-05-2021