• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణలో తాజా అడ్మిష‌న్లు

 

టీఎస్‌పీఈసెట్‌-2021 

హైద‌రాబాద్‌లోని తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి(టీఎస్‌సీహెచ్ఈ) 2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి తెలంగాణ స్టేట్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్‌(టీఎస్‌పీఈసెట్) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌ను న‌ల్గొండ‌లోని మహ‌త్మా గాంధీ యూనివ‌ర్సిటీ నిర్వ‌హిస్తోంది.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి

 

 

ఓయూలో పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ప్రోగ్రాం

హైద‌రాబాద్‌లోని ఉస్మానియా యూనివ‌ర్సిటీకి చెందిన డైరెక్ట‌రేట్ ఆఫ్ అడ్మిష‌న్స్ విభాగం 2020-2021 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* పోస్టు ఎమ్మెస్సీ డిప్లొమా (రేడియోలాజిక‌ల్ ఫిజిక్స్)

కోర్సు వ్య‌వ‌ధి: రెండు సెమిస్ట‌ర్లు (1 ఏడాది) + ఏడాది ఇంట‌ర్న్‌షిప్‌/ ఫీల్డ్ ట్రెయినింగ్.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి

 

 

యూఓహెచ్‌లో దూర‌విద్య డిప్లొమా ప్రోగ్రాములు

హైద‌రాబాద్‌లోని కేంద్ర‌విశ్వ‌విద్యాల‌య‌మైన హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ(యూఓహెచ్‌)కి చెందిన సెంట‌ర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వ‌ర్చువ‌ల్ ల‌ర్మింగ్‌ 2021 విద్యాసంవ‌త్స‌రానికి దూరవిద్య ప‌ద్ధ‌తిలో కింది డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ దూర విద్యా కోర్సుల్లో ప్ర‌వేశాలు-2021

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి

 

 

ఎన్ఐఆర్‌డీఆపీఆర్‌లో పీజీడీఎం ప్రోగ్రాములు

భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హైదార‌బాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీ రాజ్‌(ఎన్ఐఆర్‌డీఆపీఆర్) కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఎంపిక విధానం: ఆల్ ఇండియా ఎంట్ర‌న్స్ టెస్ట్ (లేదా) క్యాట్‌/ మ‌్యాట్‌/ గ‌్జాట్‌/ ఏటీఎంఏ/ సీమ్యాట్‌/ జీమ్యాట్ ఏదైనా అర్హ‌త ప‌రీక్ష‌ల‌ వాలిడ్‌ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారిని తుది ఎంపిక‌లో భాగంగా గ్రూప్ డిస్క‌ష‌న్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి

 

 

టీజీయూజీసెట్‌-2021

తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ అండ్ ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీలు 2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి టీఎస్‌డ‌బ్ల్యూ రెసిడెన్షియ‌ల్ మ‌హిళా డిగ్రీ కాలేజీల్లో, టీటీడ‌బ్ల్యూ రెసిడెన్షియ‌ల్ డిగ్రీ మెన్ అండ్ విమెన్ కాలేజీల్లో మొద‌టి ఏడాది ప్ర‌వేశాల‌కు అర్హులైన వారి నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నాయి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి

Posted Date : 01-03-2021