నిట్క్యాంపస్, న్యూస్టుడే: వరంగల్ ఎన్ఐటీలో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందిన ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు డిసెంబరు 2 నుంచి వారం రోజులపాటు ఆన్లైన్లో ప్రేరణ (ఇండక్షన్) శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శిక్షణలో వివిధ రంగాల ప్రముఖుల ఉపన్యాసాలు, మానసిక, శారీరక వికాసం పెంపొందేలా కార్యక్రమాలు ఉంటాయని ఎన్ఐటీ విద్యార్థి వ్యవహారాల విభాగం డీన్ ఆచార్య జె.వి.రమణమూర్తి తెలిపారు. పూర్తి వివరాలు వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. వెబ్లింక్ను విద్యార్థుల చరవాణులకు అందజేసినట్లు తెలిపారు.
2 నుంచి వరంగల్ నిట్లో ప్రేరణ శిక్షణ
Posted Date : 01-12-2020 .