ఈనాడు, హైదరాబాద్: యూజీ ఆయుష్ మెడికల్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుష్ కళాశాలల్లో బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్వైసీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు జనవరి 13 నుంచి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నీట్-2020లో అర్హత సాధించిన అభ్యర్థులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు కాళోజీ వర్సిటీ వెబ్సైట్ www.knruhs.telangana.gov.in చూడవచ్చని వర్సిటీ వర్గాలు తెలిపాయి.
ఆయుష్ మెడికల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ
Posted Date : 13-01-2021 .