ఈనాడు, అమరావతి: అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), సాఫ్ట్వేర్, సేవా కంపెనీల జాతీయ అసోసియేషన్ (నాస్కామ్) భాగస్వామ్యంతో ఆన్లైన్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. కోర్సు పూర్తి చేసిన వారికి ఏఐసీటీఈ, నాస్కామ్ స్కిల్ కౌన్సిల్ సెక్టార్ కలిపి సర్టిఫికెట్‌ను అందిస్తాయని, అభ్యాసన సమయం ఆధారంగా క్రెడిట్లు కేటాయిస్తాయని వెల్లడించారు. ఉచితంగా అందిస్తున్న ఈ ఆన్లైన్ కోర్సులను విద్యార్థులు, అధ్యాపకులు వినియోగించుకోవాలని సూచించారు. కృత్రిమ మేధస్సు, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, బిగ్‌డేటా అనాలసిస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంçర్నెట్ ఆఫ్ థింగ్స్తోపాటు వ్యాపార నైపుణ్యాలను పెంచే ప్రాబ్లమ్ సాల్వింగ్, డిజైన్ థింకింగ్, ప్రాజెక్టు, ప్రొడక్ట్ ప్రోగ్రాం మేనేజ్మెంట్, డిజిటల్ లీడర్షిప్, కమ్యూనికేషన్, స్టోరీ టెల్లింగ్లాంటి ప్రొఫెషనల్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు https:/ifeskillsprime.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
ఉన్నత విద్యలో ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులు
Posted Date : 12-01-2021 .