• facebook
  • whatsapp
  • telegram

ఓయూ పీజీ పరీక్షల నోటిఫికేషన్‌ విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ పరీక్షల నిర్వహణకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఎంఏ, ఎంకామ్‌, ఎమ్మెస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ తదితర కోర్సులకు సంబంధించి మూడో సెమిస్టర్‌ పరీక్షలను ఫిబ్ర‌వ‌రిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొ.శ్రీరామ్‌ వెంకటేశ్ జ‌న‌వ‌రి 16న‌ పరీక్షల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆలస్య రుసుం లేకుండా ఫిబ్రవరి ఒకటో తేదీ, రూ.300 ఆలస్య రుసుంతో 5వ తేదీలోగా ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీరామ్‌ వెంకటేశ్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. కరోనా పరిస్థితుల దృష్ట్యా గతంలో మాదిరే పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలకు సమయం కుదించడం, ఛాయిస్‌ ఎక్కువ ఇవ్వడంపై చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. దీనిపై అధికారిక నిర్ణయం రాగానే ప్రకటన విడుదల చేస్తామని వివరించారు.

Posted Date : 17-01-2021 .