* పదో తరగతికి సాయంత్రం వరకు బోధన
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఆరో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరానికి తరగతులు జనవరి 17 నుంచి పునః ప్రారంభం కానున్నాయి. జూనియర్ కళాశాలలు మే 31 వరకు 106 రోజులు పని చేయనున్నాయి. వేసవి సెలవులు, రెండో శనివారం సెలవులను రద్దు చేశారు. పదో తరగతికి ఉదయం 8.45గంటల నుంచి సాయంత్రం 4.20 వరకు బోధిస్తారు. పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు జిల్లాలవారీగా జిల్లా విద్యాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పండుగల సెలవులు మినహా ఆదివారం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.