* సబిత, చిత్రా రామచంద్రన్లకు కేటీఆర్ సూచన
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని స్ఫూర్తిప్రదాతల గాథలను తెలంగాణలో పాఠ్యాంశాలుగా చేర్చే అంశాన్ని పరిశీలించాలని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చింత్రా రామచంద్రన్లను కోరారు. సిరిసిల్లకు చెందిన దివ్యాంగ రచయిత్రి బూర రాజేశ్వరి జీవిత కథ ‘సిరిసిల్ల రాజేశ్వరి’ శీర్షికన మహారాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పాఠ్యాంశంగా ప్రచురించిన అంశాన్ని కేటీఆర్ జనవరి 17న ట్విటర్లో ప్రస్తావిస్తూ, ఈ సూచన చేశారు. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితగాథ పాఠ్యాంశం కావడం గర్వకారణమని పేర్కొన్నారు.