• facebook
  • whatsapp
  • telegram

టెన్త్, ఇంటర్ 2020-21 పరీక్షల ప్రత్యేకం

 

e-Books

 

మోడల్ పేపర్లు - నిపుణుల జవాబులతో

 

 

టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలను యథాతథంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేశారు. ఎఫ్ఏ-1 మార్కుల ఆధారంగా ఉత్తీర్ణతలు నిర్వహించే ప్రక్రియ ప్రారంభించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండా రెండో సంవత్సరంలోకి ప్రమోట్ చేస్తారు. ప్రస్తుతానికి రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేశారు. వాటిని జూన్ లో నిర్వహించే అవకాశం ఉంది. 

 

ఆంధ్రప్రదేశ్ లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు పాఠశాలలు బంద్ చేశారు. ఎలాంటి పరీక్షలు లేకుండా వారిని తర్వాతి తరగతుల్లోకి ప్రమోట్ చేస్తారు. పాఠశాలలు ఇప్పుడు ఖాళీగా ఉండటం వల్ల పదో తరగతి విద్యార్థులకు తగిన జాగ్రత్తలు, సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోతే రక్షణ రంగం తదితర ఉద్యోగాలను సంపాదించుకోవడంలో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే టెన్త్ పరీక్షలు జరపాలని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

 

ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా ప్రిపరేషన్ సాగించాలి. పరీక్షలు రద్దవుతాయనే ఊహాజనిత వార్తలను నమ్మి అదమరిస్తే నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు పరీక్షలు జరుగుతాయనే భావించి చదవాలి. పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించినా ప్రభుత్వం పరీక్షలను తప్పకుండా నిర్వహిస్తుంది. 

 

ఈ దశలో వీలైనన్ని మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. ఏ ప్రశ్నకు ఏ సమాధానం, ఎంత రాయాలి, ఎలా రాయాలనే అంశాలపై తగిన అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్ష విధానం, సిలబస్ ను దృష్టిలో ఉంచుకొని సిద్ధం కావాలని చెబుతున్నారు. వెయిటేజీల ప్రకారం చదవాలి. ముఖ్యమైన ప్రశ్నలను ఎంపిక చేసుకొని ప్రిపరేషన్ పూర్తి చేసి, తర్వాతి దశలో మిగిలిన ప్రశ్నలను చదవాలి. క్రమమైన రివిజన్ తప్పనిసరి. చదివేశాం, వచ్చేసిందని రివిజన్ చేయకుండా ఉండకూడదు. అన్నింటిని తప్పకుండా రివిజన్ చేయాలి. 

 

అధ్యాయాల వారీగా వెయిటేజీ ఎలా ఉంది, వేటిని తొలగించారు, ఏయే ప్రశ్నలు ముఖ్యమైనవి, ప్రిపరేషన్ ఎలా చేయాలి అనే అంశాలపై నిపుణులు సబ్జెక్టుల వారీగా తమ సూచనలను అందజేయడంతోపాటు మోడల్ పేపర్లను, పూర్తి సమాధానాలతో ఈ-బుక్స్ రూపంలో ఇచ్చారు. వీటిని అభ్యర్థులు తమ ప్రిపరేషన్ ను మెరుగుపరుచుకోడానికి, మంచి మార్కులు సాధించుకోడానికి ఉపయోగించుకోవచ్చు. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయి. 

 

TENTH & INTERMEDIATE 2020-21 EXAMS SPECIAL
MODEL PAPERS WITH EXPERT ANSWERS

 

 

స్టడీ మెటీరియల్ 

 

ముఖ్యమైన ప్రశ్నలు-జవాబులు

Posted Date : 20-04-2021