• facebook
  • whatsapp
  • telegram

సీపెట్‌లో శిక్షణ, ఉద్యోగావకాశం

చర్లపల్లి, న్యూస్‌టుడే: ఎన్టీపీసీ రామగుండం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉద్యోగావకాశం కల్పించనున్నామని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సీపెట్‌) డైరెక్టర్‌ వి.కిరణ్‌కుమార్ డిసెంబ‌రు 2న‌ తెలిపారు. ఈ మేరకు ఆయన నోటిఫికేషన్‌ విడుదల చేశారు. చర్లపల్లిలోని సీపెట్‌లో మిషన్‌ ఆపరేటర్‌ అసిస్టెంట్‌ ఇంజక్షన్‌ మౌల్డింగ్‌లో 3 నెలలపాటు శిక్షణ ఉంటుందని, ఆ సమయంలో ఉచిత భోజనం, వసతి, యూనిఫాం సదుపాయాలను కల్పిస్తామని వివరించారు. శిక్షణ అనంతరం ఆయా కంపెనీల్లో ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఎనిమిది లేదా పదో తరగతి చదివిన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 7893586494, 9959333418 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 

Posted Date : 02-12-2020 .