• facebook
  • whatsapp
  • telegram

టీఎస్ఐసెట్‌-2021 ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ప్రారంభం


 

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌నున్న టీఎస్ఐసెట్‌-2021 ప్ర‌వేశ ప‌రీక్ష ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ఏప్రిల్ 7 నుంచి ప్రారంభ‌మైంది. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ప‌రీక్ష రాయ‌డానికి అర్హులు. ఇందులో మంచి మార్కులు సాధిస్తే 2021-22 విద్యాసంవ‌త్స‌రానికి రాష్ట్రంలో పేరొందిన ప్ర‌భుత్వ యూనివ‌ర్సిటీల్లో ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల్లో చేర‌వ‌చ్చు. ప్ర‌వేశ ప‌రీక్ష‌ను ఈ ఏడాది కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యం(వ‌రంగ‌ల్‌) నిర్వ‌హిస్తుండ‌గా ద‌ర‌ఖాస్తుల‌కు జూన్ 15, 2021 తుది గ‌డువు. 

 

వెబ్‌సైట్‌: https://icet.tsche.ac.in/TSICET/TSICET_HomePage.aspx 

Posted Date : 07-04-2021