ఈనాడు, అమరావతి: డిగ్రీలో ప్రవేశాలు పొంది, సీటు వదులుకొని, ఇతర కోర్సుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థుల వివరాలు ఫిబ్రవరి 26, 27 తేదీల్లో ఆన్లైన్లో నమోదు చేయాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి సూచించారు. కొన్ని కోర్సుల్లో 20శాతంలోపు ప్రవేశాలు ఉండి, తరగతుల నిర్వహణ కుదరని పక్షంలో అలాంటి విద్యార్థుల ఆసక్తి మేరకు ఇతర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని, ఇందుకు 27న అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఒకవేళ విద్యార్థులు వేరే కళాశాలల్లో నచ్చిన కోర్సులోనే చేరతామంటే కళాశాలల తరఫున ఐచ్ఛికాలు నమోదు చేయాలని, ఇందుకు 28 నుంచి మార్చి ఒకటి వరకు అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. స్పాట్ ప్రవేశాలకు మార్చి 2న ప్రకటన ఇవ్వనున్నామని, 3నుంచి 10లోపు ప్రవేశాలు పూర్తి చేయాలని పేర్కొన్నారు.
డిగ్రీలో కోర్సు మార్చుకునేందుకు అవకాశం
Posted Date : 26-02-2021