• facebook
  • whatsapp
  • telegram

ఆయుర్వేద, హోమియో ఎండీ కోర్సులకు దరఖాస్తులు ప్రారంభం

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: 2020-21 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ఆయుర్వేద, హోమియో వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఆయుర్వేద, హోమియో ఎండీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నోటిఫికేషన్‌ను విజయవాడ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. అర్హత కల్గిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఫిబ్ర‌వ‌రి 26 ఉదయం 9 గంటల నుంచి మార్చి 3వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా డౌన్‌లోడ్‌ చేసుకొని ఆప్షన్ల కసరత్తు చేసుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.శంకర్‌ తెలిపారు. ఏఏ కళాశాలల్లో ఎన్నెన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చామని చెప్పారు.

Posted Date : 26-02-2021