• facebook
  • whatsapp
  • telegram

మార్చి 8 నుంచి పీఈసెట్‌ దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే విద్యాసంవత్సరానికి(2021-22) వ్యాయామ ఉపాధ్యాయ విద్య కోర్సులైన బీపీఎడ్‌, డీపీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి పీఈసెట్‌కు మార్చి 8వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ మార్చి 1వ తేదీన జారీ అవుతుంది. పీఈసెట్‌ కమిటీ మొదటి సమావేశం ఫిబ్ర‌వ‌రి 25న‌ జరిగింది. ఈ సందర్భంగా కాలపట్టికను ఖరారు చేశారు. ఆలస్య రుసుం లేకుండా మే 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, క్రీడా పరీక్షలు జూన్‌ 7న ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.

Posted Date : 26-02-2021