దేశంలోనే తొలిసారిగా మీడియా-కమ్యూనికేషన్ రంగంలో ఒ.పి.జిందాల్ గ్లోబల్ విశ్వవిద్యాలయం (జేజీయూ) పీజీ డిప్లొమా ఇన్ డేటా జర్నలిజం కోర్సును ప్రారంభించింది. ఇది ఏడాది కోర్సు కాగా.. సంప్రదాయ రిపోర్టింగ్, అనాలసిస్, డేటా ఇంటెన్సివ్ జర్నలిజం, మీడియా రిపోర్టింగ్-విశ్లేషణ, పాఠకులకు సులభంగా అర్థమయ్యే భాష పరిజ్ఞానం గురించి ఇందులో నేర్పుతారు. జిందాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ & ఫైనాన్స్ (జేఎస్ బీఎఫ్), జిందాల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం & కమ్యూనికేషన్(జేఎస్ జేసీ) సంయుక్తంగా ఈ కోర్సును రెండు విభాగాల్లో అందుబాటులోకి తీసుకొచ్చాయి. గ్రాడ్యుయేట్ల కోసం రెసిడెన్షియల్ పీజీ డిప్లొమా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఎగ్జిక్యూటివ్ పీజీ డిప్లొమా విభాగాలను ప్రవేశపెట్టారు. దేశవిదేశాల్లోని రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలను ఈ కోర్సు ద్వారా అందించనున్నారు.