• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంటర్‌ రెండో ఏడాది పరీక్ష ఫీజు గడువు పెంపు

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు గడువును ఫిబ్ర‌వ‌రి 25వరకు పొడిగిస్తూ ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఉత్తర్వు జారీ చేశారు. గతంలో అనుత్తీర్ణులైన, హాజరు మినహాయింపు, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ఇదే గడువు వర్తిస్తుందని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు మరోసారి పొడిగింపు ఉండదని, రూ.500 జరిమానాతో అనుమతించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లోనూ నేరుగా చెల్లించే సదుపాయం కల్పించారు.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌