• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంటర్‌ పరీక్షల వాయిదాకు అవ‌కాశం  

* మ‌రో ప‌ది రోజుల్లో రానున్న‌ స్ప‌ష్ట‌త 

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా కేసులు పెరుగుతున్నందున మే 1 నుంచి జరగాల్సిన ఇంటర్‌ పరీక్షలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 9.50 లక్షల మంది పరీక్షలు రాయాల్సి ఉంది. పరీక్షా కేంద్రాల వద్ద, కేంద్రాలకు వచ్చే సమయంలో భౌతిక దూరం పాటించడం కష్టమవుతుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా కేవలం 40 రోజులపాటు ప్రత్యక్ష తరగతులు జరిపి వార్షిక పరీక్షలు నిర్వహించడంపై తల్లిదండ్రులు, సంఘాల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిస్థితులు అనుకూలించకపోతే ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు వాయిదా వేయాలని, రెండో ఏడాది వరకు జరిపే అవకాశాలను పరిశీలించాలన్న దిశగా ఇంటర్‌ బోర్డులో చర్చ నడుస్తున్నట్లు సమాచారం. మరో 10రోజులు గడిస్తే పూర్తి స్పష్టత వస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Posted Date : 08-04-2021

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌