• facebook
  • whatsapp
  • telegram

గగన వీధిలో ఘన సారథి!

 ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు అవకాశం
 శిక్షణలో నెలకు రూ.50 వేలకుపైగా స్టైపెండ్‌

ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో ఉద్యోగం నలుగురు నడిచేదారి నాకొద్దని.. ప్రత్యేకతను కోరుకుంటూ కలల ఆకాశంలో విహరించే వారికి విలువైన ఉద్యోగం పైలట్‌. చక్కటి ఫిట్‌నెస్‌, హుందాగా యూనిఫాం, సామాజిక గౌరవం.. అన్నింటికి మించి ఆకర్షణీయమైన ఆరంకెల జీతం. రాష్ట్రాలు దాటి, ఖండాలను చుట్టి ప్రపంచం మొత్తం పనిగా తిరిగి వచ్చే పసందైన కొలువు. అది కావాలంటే కమర్షియల్‌ లైసెన్స్‌ (సీపీఎల్‌) పొందాలి. పైలట్‌గా చేరడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పలు అవకాశాలు ఉన్నాయి. శిక్షణతోపాటు ఉద్యోగాన్ని కూడా ఆయా సంస్థలు అందిస్తున్నాయి.
 
ఆకాశంలో ఎగిరే విమానం చూస్తే అందరికీ అదో ఆనందం. విమానం శబ్దం వినగానే ఎవరైనా మిద్దె మీదకో, బాల్కనీ అంచుకో చేరి కుడిచేతిని ఎత్తి కళ్లపై కాంతి పడకుండా అడ్డం పెట్టుకొని కన్నార్పకుండా చూసి వెళ్లాల్సిందే. పెద్దయ్యాక ఏమవుతావురా అని అడిగితే పిల్లలు కొంతమంది పైలట్‌ అవుతా.. అంటారు. అదీ విమానం మోజే. ప్రైవేటు విమానయానం విస్తరించిన తర్వాత ఈ రంగంలో ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఇంతకీ మన పిల్ల పిడుగులు ఎవరికీ అందనంత ఎత్తులో ఎగిరే పైలట్‌ కావడం ఎలా అంటారా.. దానికి పలు రకాల మార్గాలు ఉన్నాయి. శిక్షణ పొందుతూనే నెలకు రూ.50 వేలపైనే స్టైపెండ్‌ అందుకోవచ్చు. మెరుగైన నైపుణ్యాలు సాధిస్తే యుద్ధ విమానాలూ నడిపే వీలుదొరుకుతుంది. అన్నీ కలిసొస్తే భవిష్యత్తులో భారతీయ వాయుసేనను ఆధిపత్యం చేసే స్థాయికీ చేరుకోవచ్చు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ అండ్‌ నేవల్‌ అకాడెమీ (ఎన్డీఏ అండ్‌ ఎన్‌ఎ), కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) ఇంటర్‌, డిగ్రీ విద్యార్హతలతో పైలట్‌ శిక్షణ, ఉద్యోగం రెండూ అందిస్తున్నాయి. అవే కాకుండా ఎయిర్‌ ఫోర్స్‌ (ఏఎఫ్‌ క్యాట్‌), నేవీ (షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌)లు గ్రాడ్యుయేట్లకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి పైలట్‌ శిక్షణ, ఉద్యోగాన్ని కల్పిస్తున్నాయి.
 
ఇంటర్‌తో ఎన్డీఏ
పైలట్‌ కావడానికి మొదటి ప్రధాన అవకాశంగా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ (ఎన్డీఏ) పరీక్షను పేర్కొనవచ్చు. దీన్ని ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు. జనవరి, జూన్‌లో ప్రకటనలు వస్తాయి. ఎన్డీఏతో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు లభిస్తాయి. పైలట్‌ కావాలనుకునేవాళ్లు ఎయిర్‌ ఫోర్స్‌ విభాగాన్ని ఎంచుకోవాలి. ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు ఎయిర్‌ ఫోర్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సైతం అర్హులే. వయసు 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్లలోపు ఉండాలి. బాలురు మాత్రమే అర్హులు. అలాగే పైలట్‌ ఉద్యోగానికి 162.5 సెం.మీ. ఎత్తు ఉండాలి.

ఎంపిక ఇలా: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. అవి: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ తరహా), ఇంటెలిజెన్స్‌ - పర్సనాలిటీ టెస్ట్‌. రాత పరీక్షలో మొత్తం 900 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1 మ్యాథ్స్‌, పేపర్‌-2 జనరల్‌ ఎబిలిటీ. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్టులు రెండు అంచెల్లో నిర్వహిస్తుంది. రాత పరీక్ష, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీరికి పైలట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తేనే పైలట్‌ శిక్షణలోకి అనుమతి లభిస్తుంది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్సులో చేర్చుకుంటారు.
 
చదువు, శిక్షణ: ఏడు వేల ఎకరాల సువిశాల క్యాంపస్‌ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ (ఎన్‌డీఏ) పుణెలో అభ్యర్థులకు శిక్షణ, చదువు మూడేళ్లపాటు ఉంటాయి. పుస్తకాలు, భోజనం, వసతి సౌకర్యం అన్నీ ఉచితమే. అనంతరం అసలు సిసలైన పైలట్‌ శిక్షణ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడెమీ (ఏఎఫ్‌ఏ) - హైదరాబాద్‌ (దుండిగల్‌)తో పాటు పలు కేంద్రాల్లో సుమారు 18 నెలల వరకు నిర్వహిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి బీటెక్‌ను దిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రదానం చేస్తుంది. పట్టా పుచ్చుకున్న తర్వాత వీరు ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో ఎయిర్‌ ఫోర్స్‌లో చేరిపోవచ్చు.
 
డిగ్రీతో సీడీఎస్‌ఈ
డిగ్రీ అర్హతతో యూపీఎస్సీ ఏడాదికి రెండు సార్లు కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) ను నిర్వహిస్తోంది. నవంబరు, ఆగస్టుల్లో ప్రకటనలు వెలువడతాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలకు సీడీఎస్‌ఈ నిర్వహిస్తున్నారు. పైలట్‌ కావాలనుకున్నవారు ఎయిర్‌ ఫోర్స్‌ విభాగాన్ని ఎంచుకోవాలి.

అర్హత: ఏదైనా సాధారణ డిగ్రీ లేదా బీఈ / బీటెక్‌ ఉత్తీర్ణత. అయితే ఇంటర్‌లో మాత్రం మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండడం తప్పనిసరి. ఆఖరు సంవత్సరం డిగ్రీ కోర్సులు చదువుతున్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు.
 
వయసు: 20-24 ఏళ్లలోపు ఉండాలి. పురుషులు మాత్రమే అర్హులు. ఎత్తు 162.5 సెం.మీ. ఉండాలి.
 
ఎంపిక విధానం: ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లతో స్టేజ్‌-1 రాత పరీక్ష, స్టేజ్‌-2లో జరిపే ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌ల ద్వారా జరుగుతుంది. పైలట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టులోనూ అర్హత సాధించాలి. ఎంపికైనవారికి 74 వారాల పాటు ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ ఇస్తారు. అనంతరం ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో ఎయిర్‌ ఫోర్స్‌లో విధుల్లోకి తీసుకుంటారు.
 
ఉద్యోగంలో...

ఎన్డీఏ, సీడీఎస్‌ఈ, ఏఎఫ్‌ క్యాట్‌ తదితర ఏ విధానాల్లో అభ్యర్థులు ఎంపికైనప్పటికీ విజయవంతంగా పైలట్‌ శిక్షణ ముగించుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత వేతనం, హోదా అంతా సమానంగానే ఉంటాయి. ఎయిర్‌ ఫోర్స్‌లో అయితే ఫ్లయింగ్‌ ఆఫీసర్‌, నేవీలో సబ్‌ లెఫ్టినెంట్‌ హోదా ఇస్తారు. రూ.56,100 మూల వేతనం చెల్లిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు అదనం. మిలటరీ సర్వీస్‌ పే కింద ప్రతి నెల రూ.15,500 చెల్లిస్తారు. వీటితోపాటు ఫ్లయింగ్‌ అలవెన్సు (విమానం నడిపే వ్యవధికి) కూడా ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్సు, చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌ అలవెన్సు, రాయితీ ధరలకు క్యాంటీన్‌, ఫర్నీచర్‌తో కూడిన నివాస సముదాయం, తక్కువ వడ్డీకి రుణాలు, ఎల్టీఏ, 60 వార్షిక సెలవులు, 20 సాధారణ సెలవులు... ఉంటాయి. వేతన రూపంలో ప్రతినెలా రూ. లక్ష వరకు అందుకోవచ్చు. ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో ఎయిర్‌ ఫోర్స్‌లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో ఫ్లయిట్‌ లెఫ్టినెంట్‌గా పదోన్నతి పొందుతారు. ఆరేళ్ల అనుభవం ఉన్నవారు స్క్వాడ్రన్‌ లీడర్‌ అవుతారు. పదమూడేళ్ల సర్వీస్‌తో వింగ్‌ కమాండర్‌ స్థాయికి చేరుకుంటారు. అనంతరం శాఖాపరమైన నియామకాల ద్వారా ఇంకా ఉన్నత స్థాయులకు చేరుకోవచ్చు. అత్యున్నత ప్రతిభావంతులు భవిష్యత్తులో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ (ఎయిర్‌ ఫోర్స్‌లో అత్యున్నత ఉద్యోగం)గా భారతీయ వాయు సేనకు దిశానిర్దేశం కూడా చేయవచ్చు.

త్రివిధ దళాల్లోకి తిరుగులేని దారి

 కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1)- 2021 నోటిఫికేషన్ విడుదల

భారత త్రివిధ దళాల్లో చేరి దేశ సేవలో భాగస్వాములు కావాలనుందా? చిన్న వయసులోనే రక్షణ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారా? జీవితంలో సవాళ్లను స్వీకరించాలని ఉందా? అయితే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) మీకు ఆ అవకాశం కల్పిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన పాతికేళ్ల లోపు యువతకు ఈ పరీక్ష వరంలాంటిది. ఆసక్తితోపాటు ప్రతిభావంతులైన యువతను గుర్తించి, వారి ప్రతిభకు పదునుపెట్టి, సుశిక్షితులుగా తీర్చిదిద్దడానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ ఎదురుచూస్తున్నాయి. ఇందులో ఎంపికైతే గౌరవం, హోదా లభిస్తాయి. ఆర్థికంగానూ మంచి అభివృద్ధి ఉంటుంది. శిక్షణ కాలం నుంచే పెద్ద వేతనాన్ని పొందవచ్చు.  ‌సీడీఎస్ ప‌రీక్ష యూపీఎస్సీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతుంది.

ఖాళీలు.. దరఖాస్తు ప్రక్రియ

మొత్తం ఖాళీలు: 345, ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్-100, ఇండియన్ నేవెల్ అకాడమీ, ఎజిమళ -26 , ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్-32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై(ఎస్ఎస్సీ మెన్ నాన్ టెక్నికల్)-170, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (ఎస్ఎస్సీ విమెన్ నాన్ టెక్నికల్)-17.

దరఖాస్తు: వెబ్సైట్ 
http://upsconline.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేది నవంబరు 17, 2020 సాయంత్రం 6 గంటల వరకు. అర్హత కలిగిన అభ్యర్థులు పరీక్ష తేదీ మూడు వారాల ముందు నుంచి ఈ-అడ్మిట్కార్డులను వెబ్సైట్ http://upsc.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష ఫీజు:  రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు చెల్లించాల్సిన అవసరం లేదు). ఆన్లైన్ లేదా ఎస్బీఐ బ్రాంచిలో చెల్లించవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్,తిరుపతి, విశాఖపట్నం.

అర్హతలు
25 సంవత్సరాల లోపు వయసుతో పాటు అవివాహితులై ఉండాలి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఇండియన్ మిలటరీ, ఇండియన్ నేవెల్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2 జ‌న‌వ‌రి 1998 - 1 జ‌న‌వ‌రి 2003 మ‌ధ్య జ‌న్మించిన వారు అర్హులు... ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకైతే జనవరి 1, 2022 నాటికి 20 నుంచి 24 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. జనవరి 2, 1998 ముందు, జనవరి 1, 2002 తర్వాత జన్మించిన వారు అర్హులు కారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు జనవరి 2, 1997 ముందు, జనవరి 1, 2003 తర్వాత జన్మించి ఉండకూడదు.

త్రివిధ దళాల్లోకి తిరుగులేని దారి

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1)- 2021 నోటిఫికేషన్ విడుదల

భారత త్రివిధ దళాల్లో చేరి దేశ సేవలో భాగస్వాములు కావాలనుందా? చిన్న వయసులోనే రక్షణ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారా? జీవితంలో సవాళ్లను స్వీకరించాలని ఉందా? అయితే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) మీకు ఆ అవకాశం కల్పిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన పాతికేళ్ల లోపు యువతకు ఈ పరీక్ష వరంలాంటిది. ఆసక్తితోపాటు ప్రతిభావంతులైన యువతను గుర్తించి, వారి ప్రతిభకు పదునుపెట్టి, సుశిక్షితులుగా తీర్చిదిద్దడానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ ఎదురుచూస్తున్నాయి. ఇందులో ఎంపికైతే గౌరవం, హోదా లభిస్తాయి. ఆర్థికంగానూ మంచి అభివృద్ధి ఉంటుంది. శిక్షణ కాలం నుంచే పెద్ద వేతనాన్ని పొందవచ్చు.  ‌సీడీఎస్ ప‌రీక్ష యూపీఎస్సీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతుంది.

ఖాళీలు.. దరఖాస్తు ప్రక్రియ

మొత్తం ఖాళీలు: 345, ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్-100, ఇండియన్ నేవెల్ అకాడమీ, ఎజిమళ -26 , ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్-32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై(ఎస్ఎస్సీ మెన్ నాన్ టెక్నికల్)-170, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (ఎస్ఎస్సీ విమెన్ నాన్ టెక్నికల్)-17.

దరఖాస్తు: వెబ్సైట్ http://upsconline.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేది నవంబరు 17, 2020 సాయంత్రం 6 గంటల వరకు. అర్హత కలిగిన అభ్యర్థులు పరీక్ష తేదీ మూడు వారాల ముందు నుంచి ఈ-అడ్మిట్కార్డులను వెబ్సైట్ http://upsc.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష ఫీజు:  రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు చెల్లించాల్సిన అవసరం లేదు). ఆన్లైన్ లేదా ఎస్బీఐ బ్రాంచిలో చెల్లించవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్,తిరుపతి, విశాఖపట్నం.

అర్హతలు
25 సంవత్సరాల లోపు వయసుతో పాటు అవివాహితులై ఉండాలి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఇండియన్ మిలటరీ, ఇండియన్ నేవెల్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2 జ‌న‌వ‌రి 1998 - 1 జ‌న‌వ‌రి 2003 మ‌ధ్య జ‌న్మించిన వారు అర్హులు... ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకైతే జనవరి 1, 2022 నాటికి 20 నుంచి 24 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. జనవరి 2, 1998 ముందు, జనవరి 1, 2002 తర్వాత జన్మించిన వారు అర్హులు కారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు జనవరి 2, 1997 ముందు, జనవరి 1, 2003 తర్వాత జన్మించి ఉండకూడదు.

వెళ‌దామా... వాయుసేన‌లోకి!

 మూడు విభాగాల్లో పోస్టుల భ‌ర్తీకి ఏఎఫ్‌క్యాట్ ప్ర‌క‌ట‌న విడుద‌ల‌
 
డిగ్రీ అర్హతతో ఉన్న ముఖ్యమైన ఉద్యోగ పరీక్షల్లో ఏర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌) ఒకటి. ఈ పరీక్షను వాయుసేనలో ఉన్నతోద్యోగాల భర్తీకి ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తున్నారు. ఎంపికైనవారు ఏర్‌ఫోర్స్‌లో పైలట్, గ్రౌండ్‌ డ్యూటీ- టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ పోస్టులను సొంతం చేసుకోవచ్చు. శిక్షణ సమయంలో స్టైపెండ్‌తోపాటు విధుల్లో చేరిన మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు. సాధారణ డిగ్రీ, బీటెక్‌ పూర్తయినవారు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవాళ్లు వీటికి పోటీ పడవచ్చు. మహిళలూ అర్హులే. తాజాగా వెలువడిన ఏఎఫ్‌ క్యాట్‌ - 2021(1) ప్రకటన వివరాలు చూద్దాం..
 
పైలట్‌ కావాలనే ఆశయం చాలా మందికి ఉంటుంది. అయితే ఎక్కువ మంది విషయంలో ఆర్థిక నేపథ్యం అందుకు సహకరించకపోవచ్చు. ఇలాంటివారికి ఏఎఫ్‌ క్యాట్‌ చక్కని మార్గంగా నిలుస్తోంది. ఈ పరీక్షలో మెరిసినవారు ఉచితంగా పైలట్‌ శిక్షణ అందుకోవడమే కాకుండా ఏర్‌ఫోర్స్‌లో ప్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో విధులు నిర్వర్తించవచ్చు. వాయుసేనలో మేటి ఉద్యోగాలెన్నో ఏఎఫ్‌ క్యాట్‌తో సొంతం చేసుకోవచ్చు. 
 
ఏటా రెండు సార్లు అంటే ఆరు నెలలకు ఒకసారి ఈ ప్రకటన వెలువడడం అభ్యర్థుల పాలిట ఎంతో సానుకూలాంశంగా చెప్పుకోవచ్చు. గరిష్ఠ వయసుకు లోబడి కనీసం 6 నుంచి 8 సార్లు పరీక్ష రాసుకునే అవకాశం ఉన్నందున దీన్ని లక్ష్యం చేసుకుని సన్నద్ధమైనవారు రెండుమూడు ప్రయత్నాల్లోనే విజయం సాధించడానికి అవకాశాలున్నాయి. ఎంపికైనవారికి ఫ్లయింగ్, టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ బ్రాంచీల్లో ఉద్యోగాలు కేటాయిస్తారు. పరీక్ష అభ్యర్థులందరికీ ఉమ్మడిగా నిర్వహిస్తారు. టెక్నికల్‌ బ్రాంచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (ఈకేటీ) అదనంగా రాయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటర్వ్యూ అనంతరం కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం (సీపీఎస్‌ఎస్‌) పరీక్ష ఉంటుంది. వీటన్నింటిలో అర్హత సాదించినవారికి మెడికల్‌ పరీక్షలు నిర్వమించి శిక్షణకు తీసుకుంటారు. ఎంపికైన విభాగాన్ని బట్టి ఏడాది నుంచి 18 నెలలు శిక్షణ కొనసాగుతుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ అందిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు.ఉద్యోగాలను శాశ్వత, 14 ఏళ్లపాటు కొనసాగే ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
 
స్టేజ్‌ 1, 2 ఇలా...

రాత పరీక్షలో ఉత్తీర్ణులను స్టేజ్‌ 1, 2 పరీక్షలకు పిలుస్తారు. వీటిని ఏర్‌ఫోర్స్‌ సెలక్షన్‌ బోర్డు (ఏఎఫ్‌ఎస్‌బీ) నిర్వహిస్తుంది. అభ్యర్థులు 1.6 కి.మీ. దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే 10 పుష్‌ అప్స్, 3 చిన్‌ అప్స్‌ తీయగలగాలి. స్టేజ్‌ -1 స్క్రీనింగ్‌ టెస్టు. ఇందులో ఆఫీసర్‌ ఇంటలిజెన్స్‌ రాటింగ్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్టు ఉంటాయి. చిన్న అసైన్‌మెంట్లు, పజిల్స్‌ లాంటి వాటి ద్వారా అభ్యర్థి మేధను పరీక్షిస్తారు. ఏదైనా చిత్రాన్ని చూపించి దానిపై విశ్లేషణ చేయమంటారు. ఇందులో అర్హత సాధించినవారే స్టేజ్‌ -2కి వెళ్తారు. స్టేజ్‌ -2లో సైకాలజిస్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇండోర్, అవుట్‌ డోర్‌ ఇంటరాక్టివ్‌ గ్రూపు టెస్టులు ఉంటాయి. వీటిలో మానసిక, శారీరక పనులు మిళితమై ఉంటాయి. ఆపై వ్యక్తిగత ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ దశలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి మెడికల్‌ పరీక్షలు చేపడతారు. అందులోనూ విజయవంతమైతే శిక్షణ కోసం ఎంపిక చేస్తారు.  
 
శిక్షణ...
అభ్యర్థులకు సంబంధిత విభాగంలో జనవరి మొదటి వారం, 2022 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ బ్రాంచ్‌ అభ్యర్థులకు 74 వారాలు, గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌ విభాగాల వారికి 52 వారాలు వైమానిక దళ శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదునిస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు ఎంపికైనవారికి ముందుగా ఆరు నెలల పాటు ప్రాథమిక శిక్షణ ఉంటుంది. తర్వాత అభ్యర్థుల ప్రతిభ ప్రకారం.. ఫైటర్‌ పైలట్, ట్రాన్స్‌పోర్ట్‌ పైలట్, హెలికాప్టర్‌ పైలట్లగా విడదీసి శిక్షణను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఒక్కో దశలో 6 నెలలు చొప్పున దుండిగల్, హకీంపేట, బీదర్, ఎలహంకల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. 

ప్రోత్సాహకాలు...
శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 చొప్పున స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు విధుల్లో చేరతారు. ఉద్యోగంలో చేరినవారికి రూ.56,100 మూలవేతనం లభిస్తుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఎ ఇతర అలవెన్సులు ఉంటాయి. అలాగే మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ) లో భాగంగా ప్రతి నెలా రూ.15,500 చెల్లిస్తారు. పైలట్లకు ఫ్లయింగ్‌ అలవెన్సు, టెక్నికల్‌ బ్రాంచీలవారికి టెక్నికల్‌ అలవెన్సు అదనంగా అందుతాయి. అన్నీ కలుపుకుని రూ.లక్షకు పైగా వేతనం లభిస్తుంది. వీరికి వివిధ ప్రోత్సాహకాలు దక్కుతాయి.

అర్హతలు...
ఫ్లయింగ్‌ బ్రాంచ్, ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ: ఈ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌ / ప్లస్‌ 2లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివుండడం తప్పనిసరి. ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ విభాగంలో దరఖాస్తు చేసుకున్నవారికి ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ సి సర్టిఫికెట్‌ ఉండాలి.   

వయసు: జనవరి 1, 2022 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1998 - జనవరి 1, 2002 మధ్య జన్మించినవాళ్లు అర్హులు. ఎత్తు కనీసం 162.5 సెం.మీ ఉండాలి.
 
గ్రౌండ్‌ డ్యూటీ - టెక్నికల్‌ బ్రాంచ్‌: ఇందులో ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ (ఎల్రక్టానిక్స్‌/ మెకానికల్‌) పోస్టులు ఉన్నాయి. సంబంధిత లేదా అనుబంధ బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో బీటెక్‌/ బీఈ పూర్తిచేసినవాళ్లు వీటికి అర్హులు. ఇంటర్‌/ +2లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
 
గ్రౌండ్‌ డ్యూటీ - నాన్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌: ఇందులో అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, అకౌంట్స్‌ విభాగాలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్‌ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. అకౌంట్స్‌ పోస్టులకు 60 శాతం మార్కులతో బీకాం పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
వయసు: గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు జనవరి 1, 2022 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1996 - జనవరి 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు. వీటికి పురుషులు 157.5, మహిళలు 152 సెం.మీ.ఎత్తు ఉండాలి.
 
ఖాళీలు: అన్ని విభాగాల్లోనూ కలుపుకుని 235 ఉన్నాయి.  
 
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: డిసెంబరు 1 నుంచి 30 వరకు స్వీకరిస్తారు.
 
పరీక్షలు: ఫిబ్రవరిలో నిర్వహించవచ్చు.
 
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్, తిరుపతి. 
 
వెబ్‌సైట్‌: https://afcat.cdac.in

పిలుస్తోంది వైమానిక దళం... ఎంపికైతే రూ. 75 వేల వేతనం

 పైసా చెల్లించకుండా పైలట్ అయ్యే అవకాశం
 సాధారణ డిగ్రీ విద్యార్థులకు వరం
 విద్యార్థినులూ అర్హులే

సాధారణ డిగ్రీతో అసాధారణ అవకాశాలను సొంతం చేసుకునే మార్గాలు కొన్నే ఉంటాయి. అలాంటి వాటిలో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఒకటి. ఎందుకంటే ఈ పరీక్ష ద్వారా అభ్యర్థులు భారత వైమానిక దళంలో పలు రకాల (ఫ్త్లెయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ) క్లాస్ వన్ కొలువులను సొంతం చేసుకోవచ్చు. ఫ్త్లెయింగ్ బ్రాంచ్‌లో ఎంపికైనవారు పైసా ఖర్చు లేకుండా పైలట్ శిక్షణ పూర్తిచేసుకుని నెలకు సుమారు రూ.75,000 వేతనంగా పొందొచ్చు. టెక్నికల్ బ్రాంచ్‌కైతే రూ.65514, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌లకు రూ.63014 జీతంగా చెల్లిస్తారు. ఏ విభాగానికి ఎంపికైనప్పటికీ వేతనంతోపాటు పలు రకాల ఆలవెన్సులు, సౌకర్యాలను సొంతం చేసుకోవచ్చు. ఈ పోస్టులకు విద్యార్థినులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడిన నేపథ్యంలో బ్రాంచ్‌ల వారీ అర్హతలు, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం.
 
ఫ్త్లెయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచీల్లో ఖాళీల భర్తీకి భారత వైమానిక దళం ఏటా రెండు సార్లు ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ప్రకటన సాధారణంగా జూన్, డిసెంబర్‌ల్లో వెలువడుతుంది. రాత పరీక్షలు ఆగస్ట్, ఫిబ్రవరిల్లో ఉంటాయి.
 
బ్రాంచీల వారీ అర్హతలిలా...
ఫ్త్లెయింగ్ బ్రాంచ్

విద్యార్హత: ఈ విభాగంలోని పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్ చదివుండడం తప్పనిసరి. మూడేళ్ల సాధారణ డిగ్రీ లేదా ఇంజినీరింగ్ ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.
వయోపరిమితి: 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. అంటే జనవరి 2, 1992- జనవరి 1, 1996 మధ్య జన్మించినవారే అర్హులు.
ఎత్తు: కనీసం 162.5 సెం.మీ ఉండాలి. ఎలాంటి దృష్టి దోషం ఉండరాదు.

టెక్నికల్ బ్రాంచ్
విద్యార్హత: 60 శాతం మార్కులతో ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగాల్లో స్పెషలైజేషన్ చేసినవారు అర్హులు. ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 20 నుంచి 26 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎత్తు: పురుషులైతే 157.5, మహిళలు 152 సెం.మీ. ఉండాలి.

గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్
ఈ బ్రాంచ్‌లో మూడు ఉప విభాగాలున్నాయి. అవి..
1. అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్
2. అకౌంట్స్
3. ఎడ్యుకేషన్
అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 50 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.
అకౌంట్స్: 60 శాతం మార్కులతో బీకాం లేదా 50 శాతం మార్కులతో ఎంకాం లేదా సీఏ లేదా ఐసీడబ్ల్యుఏ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే
ఎడ్యుకేషన్: 50 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసుకున్నవారు, ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌లోని పై మూడు పోస్టులకూ 20 నుంచి 26 ఏళ్లలోపు వయసున్నవారు అర్హులు.
ఎత్తు: పురుషులు 157.5, మహిళలైతే 152 సెం.మీ ఉండాలి.

ఎంపిక ఇలా...
పైన పేర్కొన్న ఫ్త్లెయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ ఏ బ్రాంచ్‌కి దరఖాస్తు చేసుకున్నప్పటికీ అభ్యర్థులందరికీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అంటే ప్రశ్నపత్రం అన్ని విభాగాలకూ ఒక్కటే. టెక్నికల్ బ్రాంచ్‌కి దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈఏటీ) రాయాల్సి ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్త్లెయింగ్ బ్రాంచ్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీబీఏటీ) నిర్వహిస్తారు. అన్ని పరీక్షలూ విజయవంతంగా పూర్తిచేసుకున్న అభ్యర్థులు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగానికి ఎంపికవుతారు. వీరు శిక్షణ అనంతరం విధుల్లో చేరతారు.

రాత పరీక్షలో: వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలడుగుతారు. ప్రతి ప్రశ్నకూ నాలుగు ఆప్షన్లు ఇస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. జనరల్ అవేర్‌నెస్‌లో... చరిత్ర, క్రీడలు, భూగోళశాస్త్రం, పర్యావరణం, కళలు, సంస్కృతి, వర్తమానాంశాలు, రాజకీయాలు, పౌరశాస్త్రం, రక్షణ రంగం, సామాన్యశాస్త్రంలోని ప్రాథమికాంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్ విభాగం నుంచి... కాంప్రహెన్సన్, ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ కంప్లిషన్, సిననిమ్స్, యాంటోనిమ్స్, ఒకాబులరీ అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు. న్యూమరికల్ ఎబిలిటీ విభాగంలో... సగటు, లాభనష్టాలు, శాతాలు, సూక్ష్మీకరణ, భిన్నాలు, రేషియో అండ్ ప్రపోషన్, సింపుల్ ఇంట్రస్ట్ అంశాల్లో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలుంటాయి. రీజనింగ్, మిలటరీ ఆప్టిట్యూడ్ విభాగంలో వెర్బల్ స్కిల్స్, స్పేషియల్ ఎబిలిటీ(మెంటల్ ఎబిలిటీ) అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు.
ఈ పరీక్ష ముగిసిన వెంటనే టెక్నికల్ బ్రాంచ్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ) నిర్వహిస్తారు. వ్యవధి 45 నిమిషాలు.

స్టేజ్ 1, 2 ఇలా...
రాత పరీక్షలో ఉత్తీర్ణులను స్టేజ్ 1, 2 పరీక్షలకు పిలుస్తారు. స్టేజ్ 1 లో ఇంటెలిజెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారే స్టేజ్ 2కి వెళ్తారు. స్టేజ్ 2లో సైకలాజికల్ టెస్ట్, బృంద పరీక్షలు; ఇంటర్వ్యూలు చేపడతారు. వీటిని విజయవంతంగా పూర్తిచేసుకుంటే ఉద్యోగం ఖాయమైనట్టే. అయితే ఫ్త్లెయింగ్ బ్రాంచ్ అభ్యర్థులకు ఈ దశలో అదనంగా పీఏబీటీ ఉంటుంది. వారు ఇందులో అర్హత సాధిస్తేనే పైలట్ పోస్టులకు ఎంపికవుతారు.

ఎంపికైతే...
అభ్యర్థులకు సంబంధిత బ్రాంచ్‌లో శిక్షణ ప్రారంభమవుతుంది. ఫ్త్లెయింగ్, టెక్నికల్ బ్రాంచ్ అభ్యర్థులకు 74, గ్రౌండ్ డ్యూటీకి ఎంపికైనవారికి 52 వారాలపాటు వైమానిక దళ శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదునిస్తారు. ఈ శిక్షణ సమయంలో నెలకు రూ.21,000 చొప్పున స్త్టెపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు విధుల్లో చేరతారు. ఫ్త్లెయింగ్ బ్రాంచ్‌కు ఎంపికైనవారికి రూ.74264, టెక్నికల్ బ్రాంచ్‌వారికి రూ.65514, గ్రౌండ్ డ్యూటీ పోస్టులకు రూ.63014 చొప్పున ప్రతి నెలా వేతనం చెల్లిస్తారు. వీటితోపాటు వివిధ రకాల ప్రోత్సాహకాలు ఉంటాయి.

వెబ్‌సైట్: www.careerairforce.nic.in

పిలుస్తోంది వైమానిక దళం..ఎంపికైతే రూ.75 వేల వేతనం

ప‌రీక్ష‌లో మెరుద్దాం.. విజ‌యం సాధిద్దాం

పైలట్‌ కావాలనే ఆశయం చాలా మందికి ఉంటుంది. ఇలాంటివారికి ఏఎఫ్‌ క్యాట్‌ చక్కని మార్గంగా నిలుస్తోంది. ఈ పరీక్షలో మెరిసినవారు ఉచితంగా పైలట్‌ శిక్షణ అందుకోవడమే కాకుండా ఏర్‌ఫోర్స్‌లో ప్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో విధులు నిర్వర్తించవచ్చు. ఇందులో ప‌రీక్ష విధానం ఈ కింది విధంగా ఉంటుంది.

జనరల్‌ అవేర్‌నెస్‌: చరిత్ర, క్రీడలు, భూగోళశాస్త్రం, పర్యావరణం, కళలు, సంస్కృతి, వర్తమానాంశాలు, రాజకీయాలు, పౌరశాస్త్రం, రక్షణ రంగం, సామాన్యశాస్త్రంలోని ప్రాథమికాంశాల నుంచి ప్రశ్నలుంటాయి. సాధారణ అవగాహనతో వీటికి జవాబులు గుర్తించవచ్చు. హైస్కూల్‌ సోషల్, సైన్స్‌ పుస్తకాల్లోని ప్రాథమికాంశాలు చదువుకోవాలి. వర్తమానాంశాల కోసం పత్రికా పఠనం ఉపయోగపడుతుంది. ముఖ్యాంశాలను నోట్సుగా రాసుకుని పరీక్షకు ముందు ఒకసారి చదువుకుంటే ఎక్కువ మార్కులు పొందవచ్చు.

వెర్బల్‌ ఎబిలిటీ: కాంప్రహెన్షన్, ఎరర్‌ డిటెక్షన్, సెంటెన్స్‌ కంప్ల్లీషన్, సిననిమ్స్, యాంటనిమ్స్, ఒకాబులరీల నుంచి ప్రశ్నలడుగుతారు. అభ్యర్థి ఆంగ్లం ఎలా అర్థం చేసుకుంటున్నాడో తెలుసుకునేలా ఈ ప్రశ్నలు ఉంటాయి. ఎనిమిది నుంచి ఇంటర్‌ వరకు ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే సరిపోతుంది.  

న్యూమరికల్‌ ఎబిలిటీ: సగటు, లాభనష్టాలు, శాతాలు, సూక్ష్మీకరణ, భిన్నాలు, రేషియో అండ్‌ ప్రపోర్షన్, సింపుల్‌ ఇంట్రెస్ట్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి. హైస్కూల్‌ గణిత పాఠ్యపుస్తకాల్లోని ఈ అధ్యాయాలు బాగా చదువుకుని, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే ఎక్కువ మార్కులు సులువుగానే సాధించవచ్చు.

రీజనింగ్, మిలటరీ ఆప్టిట్యూడ్‌: వెర్బల్‌ స్కిల్స్, స్పేషియల్‌ ఎబిలిటీ (మెంటల్‌ ఎబిలిటీ) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలు తర్కంతో ముడిపడి ఉంటాయి. తగినవిధంగా ఆలోచించడం ద్వారా సమాధానం గుర్తించవచ్చు.

ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్టు: దీనిలో సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిని ఎదుర్కోవడానికి బీటెక్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదవడం తప్పనిసరి.

పరీక్ష విధానం...
పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 300 మార్కులకు ఉంటుంది. వంద ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకు ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. జనరల్‌ అవేర్‌నెస్, వెర్బల్‌ ఎబిలిటీ, రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. న్యూమరికల్‌ ఎబిలిటీ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. మిగిలిన విభాగాల్లోని డిగ్రీ స్థాయిలో వస్తాయి. అభ్యర్థులకు అవగాహన నిమిత్తం వెబ్‌సైట్‌లో మాదిరి ప్రశ్నపత్రాలు ఉంచారు. వీటిద్వారా ప్రశ్నల సరళిపై ఒక అవగాహనకు రావచ్చు. పరీక్షకు ముందు ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్టు అందుబాటులోకి వస్తుంది. టెక్నికల్‌ బ్రాంచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి అదనంగా ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (ఈకేటీ) నిర్వహిస్తారు. వ్యవధి 45 నిమిషాలు. 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున వీటికి 150 మార్కులు కేటాయించారు.

నేవీలోనూ పైలట్‌

షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో ఇండియన్‌ నేవీ పైలట్‌ పోస్టులను భర్తీ చేస్తుంది. దాంతో నేవీలో పైల‌ట్ అయ్యే అవ‌కాశం ఉంది. నిరుద్యోగ యువ‌త ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఎదురుచూస్తోంది.
 ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు అర్హులు. పదోతరగతి, ఇంటర్‌, ఇంజినీరింగ్‌ అన్నింట్లోనూ 60 శాతం మార్కులు తప్పనిసరి. వీటితోపాటు టెన్త్‌, ఇంటర్‌ ఇంగ్లిష్‌లో 60 శాతం మార్కులు ఉండాలి. 162.5 సెం.మీ. ఎత్తుతో, 21-24 ఏళ్లలోపు వారు అర్హులు. మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్‌ ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ అర్హులే. షార్ట్‌ లిస్ట్‌ చేసి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడుతుంది. ఎంపికైనవారికి నేవల్‌ అకాడమీ ఎజిమాలలో 22 వారాల పాటు శిక్షణ ఉంటుంది. అనంతరం స్టేజ్‌ -1, స్టేజ్‌ -2 ఫ్లయింగ్‌ శిక్షణ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో ఇస్తారు. వీరు నౌకాదళం తరఫున యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు నడుపుతారు. గరిష్ఠంగా 14 ఏళ్లపాటు సేవల్లో కొనసాగుతారు. ఏడాదికి రెండుసార్లు మార్చి, అక్టోబరుల్లో ప్రకటన వెలువడుతుంది. https://www.joinindiannavy.gov.in/

సివిల్‌ పైలట్‌
సివిల్‌ పైలట్‌ కోర్సుల్లో చేరడానికి ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదవాలి. 17 ఏళ్లు నిండినవారికి అవకాశం లభిస్తుంది. దేశంలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) గుర్తింపు పొందిన 30 పైలట్‌ శిక్షణ సంస్థలు ఉన్నాయి. వీటిలో 18 నెలల కోర్సు పూర్తిచేసుకుని కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ (సీపీఎల్‌) అందుకోవచ్చు. ఈ 30 సంస్థల్లో ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్‌ అకాడమీ (ఐజీఆర్‌ యూఏ)కు జాతీయ స్థాయిలో పేరుంది. ఇక్కడ సీపీఎల్‌ కోర్సు పూర్తిచేయడానికి రూ. 45 లక్షల వరకు వ్యయం అవుతుంది. ప్రస్తుతం విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు. చిన్న పట్టణాల్లోనూ విమానాశ్రయాలు ఏర్పాటయ్యే అవకాశాలు మెరుగవుతున్నాయి. భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి అభ్యర్థులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పైలట్‌ వృత్తిలో చేరిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెడికల్‌ టెస్టుల్లో ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ఎస్పీఎల్‌తో మొదలు
స్టూడెంట్‌ పైలట్‌ లైసెన్స్‌ (ఎస్పీఎల్‌) తో సివిల్‌ పైలట్‌ శిక్షణ మొదలవుతుంది. కొన్నాళ్ల శిక్షణ అనంతరం ప్రైవేటు పైలట్‌ లైసెన్స్‌ (పీపీఎల్‌) మంజూరు చేస్తారు. ఈ దశలో వీరు ఒంటరిగా చిన్నపాటి శిక్షణ విమానాన్ని నడపాలి. మరికొంత అదనపు శిక్షణ, అనుభవం అనంతరం కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ (సీపీఎల్‌) ప్రదానం చేస్తారు. సీపీఎల్‌ డిగ్రీని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) మంజూరు చేస్తుంది. ఈ లైసెన్స్‌తో ప్రయాణికులను చేరవేసే విమానాలు నడపడానికి అర్హత పొందుతారు. కొత్త పైలట్లను ఎయిర్‌ లైన్స్‌ సంస్థలు కో పైలట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటాయి.
పైలట్‌ శిక్షణ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న సంస్థల్లో చేరడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మెరుగైన శిక్షణ పొందాలనుకునేవారు కెనడా, అమెరికాల్లో పైలట్‌ కోర్సు అభ్యసించవచ్చు.

తెలంగాణలో ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడమీ ద్వారా పైలట్‌ శిక్షణ అందిస్తున్నారు. ఆసియా పసిఫిక్‌ ప్లయిట్‌ ట్రైనింగ్‌ అకాడమీ లిమిటెడ్‌, ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ అకాడమీ, వింగ్స్‌ ఏవియేషన్‌ సంస్థలు పైలట్‌ శిక్షణ నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి.

వెబ్‌సైట్లు: https://www.upsc.gov.in/, http://careerairforce.nic.in

ఏఎఫ్‌క్యాట్‌తో ఫ్ల‌యింగ్ ఆఫీస‌ర్లు 

ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌) పేరుతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ప్రత్యేకంగా ఏడాదికి రెండు సార్లు పరీక్ష నిర్వహిస్తోంది. ఏటా జూన్‌, డిసెంబరుల్లో ఈ పరీక్ష ప్రకటన వెలువడుతుంది. ఇందులో పలు రకాల పోస్టులు ఉంటాయి. వీటిలో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ (పైలట్‌) ఒకటి. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో ఈ పోస్టులు భర్తీ చేస్తారు. ఈ విధానంలో ఎంపికైనవారు 14 ఏళ్లపాటు విధుల్లో కొనసాగుతారు. మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్‌ కాడెట్‌ కార్ప్‌ (ఎన్‌సీసీ)-సీ సర్టిఫికెట్‌ ఉన్నవారు ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ ద్వారా పైలట్‌ కావచ్చు. ఈ నియామకాలు కూడా ఏఎఫ్‌క్యాట్‌ తోనే చేపడతారు.

అర్హత: ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా సాధారణ డిగ్రీ లేదా బీఈ/ బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంటర్లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ తప్పనిసరి. ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.

వయసు: 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తు: కనీసం 162.5 సెం.మీ. ఉండాలి.

రాత పరీక్ష: వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలడుగుతారు. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులకు ఇంటెలిజెన్స్‌ పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారికి సైకలాజికల్‌ టెస్ట్‌, బృంద పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. చివరగా పైలట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టులోనూ అర్హత సాధిస్తే పైలట్‌ శిక్షణకు ఎంపిక చేస్తారు.

శిక్షణ: ముందుగా ఆరు నెలల పాటు ప్రాథమిక శిక్షణ నిర్వహిస్తారు. సాధారణంగా దీన్ని ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ - దుండిగల్‌, హాకింపేట్‌, ఎలహంక, బీదర్‌ల్లో చేపడతారు. అనంతరం అభ్యర్థుల ప్రతిభ ప్రకారం ఫైటర్‌ పైలట్‌, ట్రాన్స్‌ పోర్ట్‌ పైలట్‌, హెలికాప్టర్‌ పైలట్లుగా విడదీసి అందుకుతగ్గ శిక్షణను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఈ సమయంలో నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులను ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.

సీడీఎస్ఈలో ఎంపిక ఇలా..

డిగ్రీ పూర్త‌యిన యువ‌త డిఫెన్స్ రంగంలో ఉద్యోగంలో స్థిర‌ప‌డాలంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) మంచి మ‌ర్గాన్ని చూపుతుంది. ఇందుకు అనుగుణంగా సీడీఎస్ఈ ఎంపికరెండు దశల్లో జరుగుతుంది. మొద‌టి స్టేజ్లో రాత పరీక్ష, త‌రువాతి స్టేజ్లో ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.  
రాత పరీక్షలో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ అంశాల నుంచి ప్రశ్నపత్రాలు అడుగుతారు. ఒక్కో పేపర్కు 100 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ మూడు విభాగాలకు రెండు గంటల చొప్పున సమయం కేటాయించారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ ప్రశ్నపత్రం లేదు. అన్ని విభాగాల్లోని ప్రశ్నలకు బహుళైచ్ఛిక రూపంలోనే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. జవాబు తప్పుగా రాస్తే రుణాత్మక మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్ విభాగం మినహా మిగిలిన ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఇస్తారు. ఈ రాత పరీక్షలో ఎంపికైతే స్టేజ్కు అర్హత లభిస్తుంది. స్టేజ్లో నిర్వహించే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ మిగిలిన ఇంటర్వ్యూలతో పోలిస్తే కఠినతరమైనదనే చెప్పవచ్చు. ఇది అయిదు రోజులపాటు కొనసాగుతుంది. ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్ట్లు, సైకలాజికల్  పరిశీలనల ద్వారా అభ్యర్థుల తీరును క్షుణ్ణంగా సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షిస్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలవిద్యార్థులకు బెంగళూరు కేంద్రంలో ఇవి జరుగుతాయి. ఇందులో ఎంపికైతే వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు ఆర్మీలో చేరితే లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెప్టినెంట్, ఎయిర్ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాలు లభిస్తాయి.

సిలబస్ అవగాహన

ఇంగ్లిష్: అభ్యర్థి ఆంగ్లభాషను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో పరీక్షించేలా ఈ విభాగంలో ప్రశ్నలు ఉంటాయి.

జనరల్ నాలెడ్జ్: వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతదేశ చరిత్ర, భౌగోళిక శాస్త్ర అంశాలపై అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితానికి, ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించనవే ఉంటాయి.

ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్: ఇందులో అడిగే ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. అరిథ్మెటిక్, బీజగణితం, జ్యామితి, త్రికోణమితి, క్షేత్రగణితం, స్టాటిస్టిక్స్ టాపిక్ల నుంచి అడుగుతారు.

యుద్ధ సామ‌గ్రి త‌యారు చేసేస్తారా?

గ్రూపు ‘X’, గ్రూపు ‘Y’ ట్రేడుల్లో ఎయిర్‌మెన్ పోస్టులు

నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ అంటే మ‌న‌కు వెంట‌నే గుర్తొచ్చేది యుద్ధ విమానాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, విన్యాసాలు. కానీ బాంబులు, వాటి విధ్యంస‌క ప‌రిక‌రాలు, ఆయుధ సామ‌గ్రి, క్షిప‌ణులు, రాడార్ వ్య‌వ‌స్థ‌, చిన్న‌, భారీ వాహ‌నాలు, మిస్సైల్స్‌, ఇంజిన్లు, ఆటోమొబైల్స్‌, డిజిట‌ల్‌, ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు ఇలా ఇంకా ఎన్నో ఉంటాయి. వాటిని చూసిడ‌ప్పుడ‌ల్లా మ‌నంద‌రికీ ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. వీటిని ఎక్క‌డ, ఎలా త‌యారు చేస్తారు? ఎలా వినియోగిస్తారు? వాటి ఉప‌యోగం ఏమిటి? అనే ఆలోచ‌న‌లు మ‌న మ‌న‌సులో మెదులుతాయి. ఎలాగైనా వాటి గురించి తెలుసుకోవాల‌నే కుతూహ‌లం క‌లుగుతుంది. ఇప్పుడు ఆ సందేహాల‌న్నింటికీ సమాధానం తెలుసుకునే అవ‌కాశం వచ్చేసింది. ఆ విధులను గ్రూపు ‘X’, గ్రూపు ‘Y’ ట్రేడుల విభాగాల్లో ఎయిర్ మెన్ ఉద్యోగులు నిర్వహిస్తారు. వాట‌న్నింటిని త‌యారు చేసే, నిర్వ‌హ‌ణ వీరే చూసుకుంటారు. అలాంటి కొలువుల్లో చేరాలనుకునే వారికి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

కనీస అర్హతలు 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోడానికి అవివాహిత యువకులు మాత్రమే అర్హులు. వ‌య‌సు 21 ఏళ్లు మించ‌కూడ‌దు. అంటే 16 జ‌న‌వ‌రి, 2001 నుంచి 29 డిసెంబ‌రు, 2004 మ‌ధ్య‌లో జ‌న్మించి ఉండాలి. గ్రూపు ‘X’ (ఎడ్యుకేష‌న్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ ట్రేడు మిన‌హాయించి) పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు 50 శాతం మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌/ 10+2/ త‌త్స‌మాన విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇంజినీరింగ్‌లో ఏదైనా విభాగంలో 50 శాతం మార్కుల‌తో మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేయాలి. గ్రూపు ‘Y’ (ఐఏఎఫ్(ఎస్‌), మ్యూజిషియ‌న్ ట్రేడులు మిన‌హాయించి) పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థులూ 50 శాతం మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌/ 10+2/ త‌త్స‌మాన విభాగంలో ఉత్తీర్ణ‌త సాధించాలి. లేదా రెండు సంవ‌త్స‌రాల వొకేష‌న‌ల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. గ్రూపు ‘Y’ మెడిక‌ల్ అసిస్టెంట్ ట్రేడ్‌కు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు కూడా ఇంట‌ర్మీడియ‌ట్/ 10+2/ త‌త్స‌మాన ప‌రీక్ష‌లో అర్హులు కావాల్సి ఉంది. వీరంద‌రికీ ఇంగ్లిష్ స‌బ్జెక్టులో 50 శాతం మార్కులు తప్పనిసరి.

గ్రూపు ‘X’ ప‌రీక్ష‌కు అర్హులైన అభ్య‌ర్థులు గ్రూపు ‘Y’ ప‌రీక్ష‌కూ అర్హులే. ఆన్‌లైన్‌లో అప్లికేష‌న్‌లో ఒకేసారి రెండు ట్రేడ్‌ల‌కూ ద‌ర‌ఖాస్తు చేసుకునే వీలుంటుంది. సాధార‌ణంగా ద‌ర‌ఖాస్తుదారులు 152.5 సెంటిమీట‌ర్ల ఎత్తు ఉండాలి. ఐఏఎఫ్(పి) ట్రేడ్ అభ్య‌ర్థులు 165 సెం.మీ(నేపాలీలు, ఈశాన్య రాష్ట్రాలు, ప‌ర్వ‌త ప్రాంతాలు), ఇత‌ర రాష్ట్రాల వారు 175 సెం.మీ, ఆటో టెక్‌ట్రేడ్ అభ్య‌ర్థులు 162.5 సెం.మీ (నేపాలీలు, ఈశాన్య రాష్ట్రాలు, ప‌ర్వ‌త ప్రాంతాలు), ఇత‌ర రాష్ట్రాల వారు 165 సెం.మీ ఉండాలి. ఛాతీ క‌నిష్ఠంగా 5 సెం.మీ విస్త‌రించాలి. దృష్టిదోషం ఉండ‌రాదు. వినికిడి సామ‌ర్థ్యం స్ప‌ష్టంగా ఉండాలి. ఆప‌రేష‌న్స్ అసిస్టెంట్ ట్రేడులు క‌నిష్ఠంగా 55 కేజీల బ‌రువు ఉండాలి. నేపాలీలు సైతం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ద‌ర‌ఖాస్తు విధానం

ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ 22 జ‌న‌వ‌రి, 2021న ప్రారంభ‌మై 07 ఫిబ్ర‌వ‌రి 2021న ముగుస్తుంది. సంబంధిత ధ్రువ‌ప‌త్రాల‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప‌రీక్ష రుసుం రూ.250 ఆన్‌లైన్‌లో లేదా యాక్సిస్ బ్యాంక్ బ్రాంచిలో చ‌లానా రూపంలో చెల్లించ‌వ‌చ్చు. ఆన్‌లైన్ ‌ప‌రీక్ష 18 ఏప్రిల్, 2021 నుంచి 22 ఏప్రిల్‌, 2021 తేదీల‌ మ‌ధ్య‌లో ఉంటుంది. అక్టోబ‌రు 31న మెరిట్ లిస్ట్ వెలువ‌డుతుంది. శిక్ష‌ణ‌కు ఎంపికైన‌వారి వివ‌రాలు డిసెంబ‌రు 10న ప్ర‌క‌టిస్తారు.

ఎయిర్‌మెన్ విభాగాలు

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌మెన్ ఉద్యోగాల్లో గ్రూపు ‘X’, గ్రూపు ‘Y’ ట్రేడులు ఉంటాయి. ఇందులోనూ టెక్నిక‌ల్, నాన్ టెక్నిక‌ల్ అ‌ని విభాగాలున్నాయి. గ్రూపు ‘X’ టెక్నిక‌ల్ విభాగంలో ఆటోమొబైల్ ఫిట్ట‌ర్‌, ఎల‌క్ట్రానిక్స్ ఫిట్ట‌ర్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఫిట్ట‌ర్, మెకానిక‌ల్ సిస్ట‌మ్ ఫిట్ట‌ర్‌, స్ట్ర‌క్చ‌ర్స్ ఫిట్ట‌ర్‌, ఫ్రొప‌ల్ష‌న్ ఫిట్ట‌ర్‌, వ‌ర్క్‌షాప్ ఫిట్ట‌ర్ (స్మిత్‌), వ‌ర్క్‌షాప్ ఫిట్ట‌ర్ (మెకానిక‌ల్‌), వెప‌న్ ఫిట్ట‌ర్ ఉద్యోగాలు ఉంటాయి. నాన్‌టెక్నిక‌ల్ విభాగంలో ఎడ్యుకేష‌న్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ ఉద్యోగం ఉంటుంది. గ్రూపు ‘Y’ టెక్నిక‌ల్ విభాగంలో క‌మ్యూనికేష‌న్ టెక్నీషియ‌న్లు‌, ఆటోమొబైల్ టెక్నీషియ‌న్లు ఉంటారు. నాన్ టెక్నిక‌ల్ విభాగంలో అసిస్టెంట్లు (అడ్మిన్, యాక్ట్స్, మెడిక‌ల్, లాజిస్టిక్, ఇన్విరాన్‌మెంట్ స‌పోర్ట్ స‌ర్వీస్‌, ఒపీఎస్, మెట్రోలాజిక‌ల్‌, గ్రౌండ్ ట్రైనింగ్‌), ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌(పోలీస్‌, సెక్యూరిటీ), మ్యూజిషియ‌న్ ఉంటారు. 

ఎంపిక ఎలా?

సెంట్ర‌ల్ ఎయిర్‌మెన్ సెల‌క్ష‌న్ బోర్డ్ ఆధ్వ‌ర్యంలో అభ్య‌ర్థుల ఎంపిక జ‌రుగుతుంది. అభ్య‌ర్థుల‌ను రాత‌ప‌రీక్ష‌, శ‌రీర‌దార్ఢ్య ప‌రీక్ష‌, మెడిక‌ల్ ప‌రీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. ప్ర‌శ్న‌లు అబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. ప్ర‌శ్న‌ప‌త్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్య‌మంలో ఇస్తారు. గ్రూపు ‘X’ ప‌రీక్ష‌కు 60 నిమిషాల స‌మ‌యం కేటాయించారు. ప్ర‌శ్న‌లు 10+2 సీబీఎస్ఈ సిల‌బ‌స్‌లోని ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, మ్యాథ‌మేటిక్స్ నుంచి వ‌స్తాయి. గ్రూపు ‘Y’ ప‌రీక్ష‌కు 45 నిమిషాల స‌మ‌యం ఇస్తారు. ఇందులో రీజ‌నింగ్ & జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్, 10+2 సీబీఎస్ఈలోని ఇంగ్లిష్ స‌బ్జెక్టు నుంచి ప్ర‌శ్న‌లు అడుగుతారు. గ్రూపు ‘X’, గ్రూపు ‘Y’ రెండు ప‌రీక్ష‌ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు 85 నిమిషాల స‌మ‌యం కేటాయించారు. వీరికి 10+2 సీబీఎస్ఈలోని ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, మ్యాథ‌మేటిక్స్‌, రీజ‌నింగ్ & జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ నుంచి ప్ర‌శ్న‌లుంటాయి. ఒక‌ప్ర‌శ్న‌కు ఒక మార్కు. త‌ప్పుగా గుర్తించిన స‌మాధానికి 1/4 మార్కు కోత విధిస్తారు. ఇందులో ఎంపికైన వారికి ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌కు అర్హ‌త ల‌భిస్తుంది. ఇక్క‌డ 1.6 కి.మీ దూరాన్ని 6 నిమిషాల 30 సెక‌న్లలో పూర్తి చేయాలి. అలాగే నిర్ణీత వ్య‌వ‌ధిలో 10 పుష్అప్స్‌, 10 సిట్అప్స్‌, 20 స్క్వాట్స్ పూర్తి చేయాలి. ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో అర్హ‌త సాధించిన వారికి అడాప్ట‌బిలిటీ టెస్టు-1 నిర్వ‌హిస్తారు. అభ్య‌ర్థి ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగానికి స‌రిపోతాడో లేదో తెలుసుకోవ‌డానికి అబ్జెక్టివ్ త‌ర‌హాలో రాత ప‌రీక్ష ఉంటుంది. ఇందులో అర్హ‌త సాధించిన వారికి అడాప్ట‌బిలిటీ టెస్ట్-2 ఉంటుంది. ఇక్క‌డ అభ్య‌ర్థి వాయుసేన వాతావ‌ర‌ణానికి అల‌వాటు ప‌డ‌తాడా? లేదా? అని ప‌రిశీలిస్తారు. వీటిలో ఉత్తీర్ణ‌త సాధిస్తే మెడిక‌ల్ టెస్ట్‌ల‌కు పంపిస్తారు. అన్ని ప‌రీక్షల్లో ఎంపికైన వారికి సంబంధిత ట్రేడుల్లో జ‌న‌వ‌రి, 2022 నుంచి బెళ‌గ‌వి (క‌ర్ణాట‌క‌) ప్రాథ‌మిక శిక్ష‌ణ కేంద్రంలో త‌ర్ఫీదు నిర్వ‌హిస్తారు. అనంత‌రం అభ్య‌ర్థుల‌ను సంబంధిత ట్రేడ్ శిక్ష‌ణ కేంద్రాల‌కు పంపుతారు. ఆ ట్రేడుల్లో విజ‌య‌వంతంగా శిక్ష‌ణ పూర్తి చేసుకున్న వారిని విధుల్లోకి తీసుకుంటారు.

జీతభ‌త్యాలు 

ఎంపికైన అభ్య‌ర్థుల‌కు శిక్ష‌ణ కాలంలో నెల‌కు రూ.14,600 స్టైపెండ్ ఇస్తారు. శిక్ష‌ణ అనంత‌రం గ్రూపు ‘X’ట్రేడు (ఎడ్యుకేష‌న్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ ట్రేడు మిన‌హాయించి)ల‌కు నెల‌కు రూ.33,100 వేత‌నం ఉంటుంది. గ్రూపు ‘Y’ ట్రేడు (ఐఏఎఫ్(ఎస్‌), మ్యూజిషియ‌న్ ట్రేడులు మిన‌హాయించి)ల‌కు రూ.26,900 ఇస్తారు. వీరికి జీతంతో పాటు ఇత‌ర అల‌వెన్సులు ఉంటాయి. విధుల్లో కొన‌సాగే వారు భ‌విష్య‌త్తులో ప‌దోన్న‌తుల ద్వారా మాస్ట‌ర్ వారెంట్ ఆఫీస‌ర్ (ఎండ‌బ్ల్యూవో) స్థాయి వ‌ర‌కు చేరుకోవ‌చ్చు. స‌ర్వీసులో కొన‌సాగుతూ కొన్ని ప‌రీక్ష‌ల్లో అర్హ‌త‌లు సాధించిన వారు క‌మిష‌న్డ్ ఆఫీస‌ర్లు కావ‌డానికీ అవ‌కాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తూనే నిర్ణీత వ్య‌వ‌ధితో ఉన్న‌త విద్య కొన‌సాగించ‌డానికీ అనుమ‌తిస్తారు. 57 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు ఉద్యోగంలో  కొన‌సాగే అవ‌కాశం ఉంది. ప‌ద‌వీవిర‌మ‌ణ త‌ర్వాత పింఛ‌ను, ఇత‌ర సౌక‌ర్యాలు అందుతాయి.

వెబ్‌సైట్లు: www.airmenselection.cdac.in, www.careerindianairforce.cdac.in
 
ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

నమూనా ప్రశ్నపత్రాలు