• facebook
  • whatsapp
  • telegram

సైన్యంలో సాంకేతిక పోస్టులు

 ఇంజినీరింగ్‌ విద్యార్థులు అర్హులు

ఇండియన్‌ ఆర్మీ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) విధానంలో టెక్‌ పోస్టులకు ప్రకటన వెలువరించింది. వీటికి బీటెక్‌ విద్యార్థులు పోటీ పడవచ్చు. మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో శిక్షణలోకి తీసుకుంటారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ప్రదానం చేసి, లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.

ఎస్‌ఎస్‌సీ టెక్‌ మెన్, ఉమెన్‌ ఖాళీలు మొత్తం 191 ఉన్నాయి. వీటిలో మెన్‌ 175, ఉమెన్‌ 14, ఆర్మీ విడోలకు 2 కేటాయించారు. మెన్‌ ఖాళీల్లో విభాగాలవారీ.. సివిల్‌లో 49, మెకానికల్‌ 15, ఎల్రక్టికల్‌ అండ్‌ ఎల్రక్టానిక్స్‌ 16, కంప్యూటర్‌ సైన్స్‌ 47, ఎల్రక్టానిక్స్, అనుబంధ విభాగాల్లో 29, ఏరోనాటికల్‌ 5, ఏవియానిక్స్‌ 5, ఏరోస్పేస్‌ 1, ఆటోమొబైల్‌ 2, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 2, టెక్స్‌టైల్, ట్రాన్స్‌పోర్టేషన్, ఆర్కిటెక్చర్, బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌... ఒక్కో విభాగంలో ఒకటి చొప్పున ఉన్నాయి. మహిళలకు సంబంధించి సివిల్‌ 3, ఎల్రక్టికల్‌ 2, ఎల్రక్టానిక్స్‌ 2, కంప్యూటర్స్‌ 4, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఏరోనాటికల్‌ ఒక్కో విభాగంలో 1 చొప్పున ఉన్నాయి. 

విద్యార్హత: సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు ఏప్రిల్‌ 1 నాటికి ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. డిఫెన్స్‌ విడో ఖాళీల్లో ఒక పోస్టుకు ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు, మరొకదానికి ఇంజినీరింగ్‌ అభ్యర్థులు పోటీపడవచ్చు.

వయసు: ఏప్రిల్‌ 1, 2021 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్‌ 2, 1994 - ఏప్రిల్‌ 1, 2001లోగా జన్మించినవారు అర్హులు. ఆర్మీ విడోల గరిష్ఠ వయసు 35 ఏళ్లకు మించరాదు. 

ఎంపిక విధానం
వచ్చిన దరఖాస్తులను వారి గ్రాడ్యుయేషన్‌ (బీటెక్‌) మార్కుల ఆధారంగా షార్ట్‌ లిస్టు చేస్తారు. ఇలా వడపోతలో నిలిచినవారికి సెలక్షన్‌ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దక్షిణ భారతీయులకు బెంగళూరులో ముఖాముఖి పరీక్ష ఉంటుంది. సైకాలజిస్ట్, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. రెండు దశల్లో అయిదు రోజుల పాటు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్‌ 1లో ఉత్తీర్ణులు మాత్రమే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్‌ 2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. ఇందులో విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు. 

శిక్షణ.. వేతనాలు..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ చెన్నైలో ఏప్రిల్, 2021 నుంచి శిక్షణ మొదలవుతుంది. దీని వ్యవధి 49 వారాలు. ఈ సమయంలో వీరికి నెలకు రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని మద్రాస్‌ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. వీరిని లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని పర్మనెంట్‌ కమిషన్‌ లోకి (శాశ్వత ఉద్యోగం) తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్‌ పొడిగిస్తారు. అనంతరం వైదొలగాల్సి ఉంటుంది. 

లెఫ్టినెంట్‌గా విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల అనుభవంతో మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలకు చేరుకోవచ్చు. విధుల్లో చేరినవారికి రూ.56,100 (లెవెల్‌ 10) మూల వేతనంతోపాటు మిలటరీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనంగా అందుకోవచ్చు. ఎన్నో ప్రోత్సాహకాలు పొందవచ్చు. 

వెబ్‌సైట్‌: http://www.joinindianarmy.nic.in/

ఆర్మీలోకి ఆహ్వానం!

 ఎంపికైతే ఉచిత విద్య, ఉద్యోగం
 
దేశ రక్షణ దళాల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌లో చేరటం అంటే భవితను అద్భుతంగా తీర్చిదిద్దుకునే ఛాన్స్‌ చేజిక్కించుకున్నట్టే! విజయవంతంగా కోర్సు పూర్తిచేస్తే చక్కని హోదాతో ఉద్యోగంలోకి ప్రవేశించవచ్చు. ఇందుకు వీలు కల్పించే ఆర్మీ ఎంట్రీ పథకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి. వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించి, ప్రతిభావంతులను ఎంపిక చేస్తారు.
 
ఆర్మీలో టెక్నికల్‌ ఎంట్రీ స్కీం
ఇంటర్మీడియట్‌ ఎంపీసీ గ్రూప్‌ విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్యతోపాటు లెఫ్టినెంట్‌ ఉద్యోగావకాశం కూడా అందిస్తోంది ఇండియన్‌ ఆర్మీ. దానిలో భాగంగా 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీం ప్రకటనను విడుదల చేసింది. మొత్తం ఖాళీలు 90. అవివాహితులైన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ విధానంలో ఎంపికైనవారు కమిషన్‌ ట్రెయినింగ్‌లో అయిదేళ్ల ఇంజినీరింగ్‌ విద్యను ఉచితంగా చదువుకోవచ్చు. అనంతరం ఆర్మీలో శాశ్వత ప్రాతిపదికన లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగం సొంతమవుతుంది.

మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో కనీసం 70శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత పొందినవారు ఈ ఎంట్రీ స్కీముకు పోటీపడవచ్చు. నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు ఉండాలి. అభ్యర్థులు 01.01.2000 నుంచి 01.01.2003 మధ్య జన్మించి ఉండాలి.
 
స్టేజ్‌ 1, 2 పరీక్షలు, ఇంటర్వ్యూ, శారీరక, వైద్య తదితర పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
 
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 27.11.2018.
 
వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/

ఆర్మీలో ఆఫీస‌ర్ స్థాయి ఉద్యోగాలు

దేశంలో నిరుద్యోగ యువ‌త ఆర్మీలో త‌మ ఉద్యోగ ప్ర‌స్తానం ప్రారంభించడాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తుంటారు. ఆర్మీలోని ఉద్యోగాల‌ను రెండు విధానాల ద్వారా భ‌ర్తీ చేస్తారు. అవి ప‌ర్మనెంట్ క‌మిష‌న్‌, షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్‌. 

ప‌ర్మనెంట్ క‌మిష‌న్‌
కేవ‌లం ఇంట‌ర్ అర్హత‌తో నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడెమీ(ఎన్‌డీఏ), డిగ్రీ అర్హత‌తో కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీసెస్‌(సీడీఎస్‌) ప‌రీక్షల ద్వారా ఆఫీస‌ర్ స్థాయి ఉద్యోగాల‌ను అందుకోవ‌చ్చు. ఈ రెండు ప‌రీక్షల‌నూ యూపీఎస్‌సీ నిర్వహిస్తోంది. ఎన్‌డీఏ ప‌రీక్షలో ఎంపికైన‌వాళ్లు నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడెమీ, పుణెలో శిక్షణ పొందుతారు. వీళ్లకు శిక్షణ అందించ‌డంతోపాటు డిగ్రీ కూడా చ‌దివిస్తారు. అనంత‌రం సంబంధిత విభాగానికి చెందిన క్యాడెట్ శిక్షణ పొందుతారు. ఎన్‌డీఏ ద్వారా ఆర్మీలో ప్రవేశం పొందిన‌వాళ్లు క్యాడెట్ శిక్షణ‌లో భాగంగా మిల‌ట‌రీ అకాడెమీ, డెహ్రాడూన్‌లో త‌ర్ఫీదు తీసుకుంటారు. అలాగే సీడీఎస్ ప‌రీక్ష ద్వారా ఆర్మీకి ఎంపికైన‌వాళ్లు కూడా ఐఎంఏ,డెహ్రాడూన్‌లోనే శిక్షణ తీసుకుంటారు. అయితే ఎన్‌డీఏ, సీడీఎస్‌లే కాకుండా డైరెక్ట్ ఎంట్రీ స్కీం ద్వారా కూడా ఆర్మీలో ఆఫీస‌ర్ స్థాయి ఉద్యోగాల్లో ప్రవేశం పొందే వీలుంది. అవి...

10+2 టెక్ ఎంట్రీ: ఎంపీసీ గ్రూప్‌తో మెరిట్ విద్యార్థులు ఈ విధానం ద్వారా రాత ప‌రీక్ష లేకుండా నేరుగా ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వూతోనే ఉద్యోగాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ విధానంలో ఎంపికైన‌వాళ్లకి ఐదేళ్ల శిక్షణ ఉంటుంది. ఇందులో నాలుగేళ్లు క్యాడెట్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే వీళ్లు అభిరుచి, అవ‌కాశం మేర‌కు ఉచితంగానే బీటెక్ చ‌దువుకోవ‌చ్చు. అనంత‌రం ఏడాదిపాటు ఐఎంఏలో ఏడాది శిక్షణ ఉంటుంది. ఆ త‌ర్వాత వీళ్లు లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరుతారు.

డైరెక్ట్ ఎంట్రీ: ఇంజినీరింగ్ అర్హత‌తో డైరెక్ట్ ఎంట్రీ విధానంలో ఆర్మీలో చేరొచ్చు. ఇంజినీరింగ్‌లో 70 శాతం మార్కులు సాధించిన‌వాళ్లు ఈ పోస్టుల‌కు అర్హులు. వీళ్లు కూడా కేవ‌లం స‌ర్వీస్ సెల‌క్షన్ బోర్డ్ (ఎస్ఎస్‌బీ) ఇంట‌ర్వ్యూతోనే ఎంపిక కావ‌చ్చు. ఇలా ఎంపికైన‌వాళ్లకు 18 నెల‌ల పాటు మిల‌ట‌రీ అకాడెమీలో శిక్షణ ఉంటుంది.

షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్‌...
ఈ విధానంలో ప‌దేళ్ల వ‌ర‌కు ఆర్మీలో ఆఫీస‌ర్‌గా కొన‌సాగే అవ‌కాశం ఉంది. ఆ త‌ర్వాత అభ్యర్థి ప‌ర్మనెంట్ క‌మిష‌న్‌కు ఎంపికైతే కొన‌సాగొచ్చు, కావాలంటే వైదొల‌గొచ్చు. స‌ర్వీస్‌లో మ‌రో నాలుగేళ్లు పొడిగించుకునే అవ‌కాశం కూడా ఉంది. అభ్యర్థి ఈ వ్యవ‌ధిలో న‌చ్చిన‌ప్పుడు వైదొలిగే అవ‌కాశం ఉంది. ఈ క‌మిష‌న్ ద్వారా ఎంపికైన‌వాళ్లు ఆర్మీ కార్యాల‌యాల్లో అడ్మినిస్ట్రేష‌న్‌ విభాగంలో కొనసాగుతారు కాబ‌ట్టి వీళ్లకు బ‌య‌ట కూడా అవ‌కాశాలు మెండుగానే ఉంటాయి. ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ ప‌రీక్షల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన‌వాళ్లకు చెన్నైలోని ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడెమీలో శిక్షణ ఉంటుంది.

ప‌ర్మనెంట్ క‌మిష‌న్ ద్వారా భ‌ర్తీ అయ్యే ఉద్యోగాలు వివ‌రంగా...

నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్‌డీఏ)
నిర్వహ‌ణ‌: యూపీఎస్‌సీ
ప్రక‌ట‌న‌: ఏడాదికి రెండు సార్లు. మార్చి, అక్టోబ‌ర్‌ల్లో వెలువ‌డుతుంది.
ఖాళీలు: ఒక్కో విడ‌త‌లో 195 వ‌ర‌కు ఉండొచ్చు.
అర్హత‌: ఇంట‌ర్ ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: 16 1/2 నుంచి 19 ఏళ్లు
కోర్సు ప్రారంభం: ఏటా జ‌న‌వ‌రి, జులైల్లో
ట్రైనింగ్ అకాడెమీ: ఎన్‌డీఏ, పుణె
శిక్షణ‌: మూడేళ్లు ఎన్‌డీఏలో+ ఏడాది ఐఎంఏలో

10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్‌
భ‌ర్తీ: ఏడాదికి రెండుసార్లు
ఖాళీలు: ఒక్కో విడ‌త‌లో 85
ప్రక‌ట‌న‌: ఏప్రిల్‌, సెప్టెంబ‌ర్ నెల‌ల్లో
ఎంపిక‌: అడిష‌న‌ల్ డైరెక్టరేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ రిక్రూటింగ్ ద్వారా
అర్హత‌: గ్రూప్ స‌బ్జెక్టుల్లో క‌నీసం 70 శాతం మార్కుల‌తో 10+2/ఇంట‌ర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ స‌బ్జెక్టుల్లో ఉత్తీర్ణత‌
శిక్షణ ప్రారంభం: ఏటా జ‌న‌వ‌రి, జులైల్లో
శిక్షణ కేంద్రం: ఐఎంఏ, డెహ్రాడూన్‌
శిక్షణ వ్యవ‌ధి: ఐదేళ్లు (ఏడాది పాటు ఐఎంఏలో నాలుగేళ్లు సంబంధిత ట్రేడ్‌(ఇంజ‌నీరింగ్ బ్రాంచ్‌)లో శిక్షణ ఉంటుంది.

సీడీఎస్ఈ(ఐఎంఎ)
ప‌రీక్ష: కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్‌(సీడీఎస్ఈ)
నిర్వహ‌ణ‌: యూపీఎస్‌సీ
భ‌ర్తీ: ఏటా రెండు సార్లు
ఖాళీలు: 250 వ‌ర‌కు ఉండొచ్చు.
ప్రక‌ట‌న‌: మార్చి/ ఏప్రిల్‌, సెప్టెంబ‌ర్‌/ అక్టోబ‌ర్‌ల్లో
అర్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: 19 నుంచి 24 ఏళ్లు
శిక్షణ ప్రారంభం: జ‌న‌వ‌రి, జులై నెల‌ల్లో
శిక్షణ కేంద్రం: ఐఎంఏ, డెహ్రాడూన్‌
శిక్షణ వ్యవ‌ధి: 18 నెల‌లు

టీజీసీ(ఇంజినీర్స్‌)
ప్రక‌ట‌న‌: ఏడాదికి రెండు సార్లు (ఏప్రిల్‌, అక్టోబ‌ర్‌ల్లో)
భ‌ర్తీచేసే సంస్థ: అడిష‌న‌ల్ డైరెక్టరేట్ జ‌న‌ర‌ల్ రిక్రూటింగ్ బ్రాంచ్‌
అర్హత‌: నిర్దేశిత బ్రాంచ్‌ల్లో బీఈ/ బీటెక్‌
వ‌యోప‌రిమితి: 20 - 27 ఏళ్లు
కోర్సు ప్రారంభం: జ‌న‌వ‌రి, జులై నెల‌ల్లో
శిక్షణ కేంద్రం: ఐఎంఏ, డెహ్రాడూన్‌
వ్యవ‌ధి: ఏడాది

షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా భ‌ర్తీ అయ్యే ఉద్యోగాలు వివ‌రంగా...

ఎస్ఎస్‌సీ నాన్ టెక్నిక‌ల్ (మెన్‌)
ఎంపిక‌: సీడీఎస్ఈ ద్వారా
నిర్వ‌హ‌ణ‌: యూపీఎస్‌సీ
ప్ర‌క‌ట‌న‌: ఏటా రెండు సార్లు
ఖాళీలు: 175 వ‌ర‌కు ఉండొచ్చు
అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ
వ‌యోప‌రిమితి: 19-25 ఏళ్లు
శిక్ష‌ణ ప్రారంభం: ఏప్రిల్‌, అక్టోబ‌ర్ నెల‌ల్లో
శిక్ష‌ణ కేంద్రం: ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ (ఓబీఏ), చెన్నై
శిక్ష‌ణ వ్య‌వ‌ధి: 49 వారాలు

టీజీసీ ఎడ్యుకేష‌న్ (ఏఈసీ)
ప్ర‌క‌ట‌న‌: ఏటా రెండు సార్లు (ఏప్రిల్‌, అక్టోబ‌ర్‌ల్లో)
ఎంపిక సంస్థ‌: అడిష‌న‌ల్ డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్‌, రిక్రూటింగ్‌
అర్హ‌త‌: క‌నీసం సెకెండ్ క్లాస్‌తో ఏదైనా పీజీ ఉత్తీర్ణ‌త‌ (ఎంఏ/ ఎమ్మెస్సీ)
వ‌యోప‌రిమితి: 23-27 ఏళ్లు
శిక్ష‌ణ ప్రారంభం: జ‌న‌వ‌రి, జులైల్లో
శిక్ష‌ణ కేంద్రం: ఐఎంఏ, డెహ్రాడూన్‌
శిక్ష‌ణ వ్య‌వ‌ధి: ఏడాది

ఎస్ఎస్‌సీ నాన్ టెక్ (ఉమెన్‌)
ప‌రీక్ష‌: సీడీఎస్ఈ
నిర్వ‌హ‌ణ‌: యూపీఎస్‌సీ
ప్ర‌క‌ట‌న‌: ఏటా రెండు సార్లు (మార్చి/ ఏప్రిల్‌, సెప్టెంబ‌ర్‌/ అక్టోబ‌రుల్లో)
ఖాళీలు: 175 వ‌ర‌కు ఉండొచ్చు
అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌
వ‌యోప‌రిమితి: 19-25 ఏళ్లు (అవివాహితులై ఉండాలి)
కోర్సు ప్రారంభం: జ‌న‌వ‌రి, జులైల్లో
శిక్ష‌ణ కేంద్రం: ఓటీఏ, చెన్నై
శిక్ష‌ణ వ్య‌వ‌ధి: 49 వారాలు

జ‌డ్జ్ అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ (జాగ్‌) మెన్

‌ప్ర‌క‌ట‌న‌: ఏడాదికి రెండు సార్లు
ఖాళీలు: అప్ప‌టి ప‌రిస్థితుల బ‌ట్టి ఆదార‌ప‌డి ఉంటుంది
నిర్వ‌హ‌ణ‌: అడిషిన‌ల్ డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ రిక్రూటింగ్‌
అర్హ‌త‌: డిగ్రీతోపాటు ఎల్ఎల్బీ/ ఎల్ఎల్ఎంలో క‌నీసం 55 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త‌. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/ స్టేట్‌లో పేరు న‌మోదు చేసుకోవాలి.
కోర్సు ప్రారంభం: ఏప్రిల్‌, అక్టోబరుల్లో
శిక్ష‌ణ కేంద్రం: ఓటీఏ, చెన్నై
వ్య‌వ‌ది: 49 వారాలు

షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ టెక్నిక‌ల్ (మెన్‌)
ఖాళీలు: 50 వ‌ర‌కు ఉండొచ్చు
ప్రక‌ట‌న‌: ఏడాదికి రెండు సార్లు (ఏప్రిల్‌, అక్టోబ‌రుల్లో)
నిర్వహ‌ణ‌: అడిషిన‌ల్ డైరెక్టరేట్ జ‌న‌ర‌ల్ రిక్రూటింగ్‌
అర్హత‌: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ
వ‌యోప‌రిమితి: 20-27 ఏళ్లు
ఎంపిక‌: ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ ద్వారా
శిక్షణ ప్రారంభం: ఏప్రిల్‌, అక్టోబ‌ర్ నెల‌ల్లో
శిక్షణ కేంద్రం: ఓటీఏ, చెన్నై
శిక్షణ వ్యవ‌ధి: 49 వారాలు

ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ మెన్‌
ఖాళీలు: 50
ప్రక‌ట‌న‌: ఏడాదికి రెండుసార్లు

అర్హత‌: 50 శాతం మార్కుల‌తో ఎల్ఎల్‌బీ/ ఎల్ఎల్ఎంలో ఉత్తీర్ణత‌తోపాటు ఎన్‌సీసీ సీనియ‌ర్ డివిజ‌న్ ఆర్మీలో రెండేళ్ల స‌ర్వీస్‌, సీ స‌ర్టిఫికెట్ ప‌రీక్షలో క‌నీసం బీ గ్రేడ్ ఉండాలి. అవివాహితులే అర్హులు.
వ‌యోప‌రిమితి: 19-25 ఏళ్లు
ఎంపిక విధానం: ఎస్ఎస్ బీ ఇంట‌ర్వ్యూ ద్వారా
శిక్షణ ప్రారంభం: ఏప్రిల్‌, అక్టోబ‌రుల్లో
ట్రైనింగ్ అకాడెమీ: ఓటీఏ, చెన్నై
శిక్షణ వ్యవ‌ధి: 49 వారాలు

ఎస్ఎస్‌సీ టెక్ ఉమెన్‌
ఖాళీలు: అప్పటి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటాయి.
నిర్వహ‌ణ: అడిషిన‌ల్ డైరెక్టరేట్ జ‌న‌ర‌ల్ రిక్రూటింగ్‌
ప్రక‌ట‌న‌: ఏటా రెండు సార్లు

శిక్షణ ప్రారంభం: అక్టోబ‌ర్‌, ఏప్రిల్ నెల‌ల్లో
శిక్షణ కేంద్రం: ఓటీఏ, చెన్నై
శిక్షణ వ్యవ‌ధి: 49 వారాలు

ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ ఉమెన్‌
ప్రక‌ట‌న‌: ఏడాదికి రెండు సార్లు
ఖాళీలు: అప్పుడున్న ప‌రిస్థితుల బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది

ఎంపిక విధానం: ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ ద్వారా

యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీమ్‌
ఖాళీలు: 60
ప్రక‌ట‌న‌: ఏటా ఒక‌సారి (మేలో ఉండొచ్చు)

అర్హత‌: ఇంజినీరింగ్ ఫైన‌ల్‌ / ప్రిఫైన‌ల్ విద్యార్థులు అర్హులు
వ‌యోప‌రిమితి: 19-25 ఏళ్లు (ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థులు) 18-24 ఏళ్లు (ప్రిఫైన‌ల్ విద్యార్థులు) అవివాహితులే అర్హులు
ఎంపిక‌: ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ ద్వారా
శిక్షణ ప్రారంభం: జులైలో
శిక్షణ కేంద్రం: ఐఎంఏ, డెహ్రాడూన్‌
శిక్షణ వ్యవ‌ధి: ఏడాది

వెబ్‌సైట్లు: http://joinindianarmy.nic.in, https://www.upsc.gov.in/

ప‌ది నుంచి పీజీ వ‌ర‌కు ఆర్మీలో ఉద్యోగాలివీ...

ర‌క్షణ‌ ద‌ళంలో ఉద్యోగ‌మంటే దేశానికి సేవ‌చేసే అవ‌కాశాన్ని ద‌క్కించుకోవ‌డ‌మే. అయితే సేవ‌తోపాటు సంతృప్తి, ఆక‌ర్షణీయ వేత‌నం, ప‌లు ర‌కాల భ‌త్యాలు, వ‌స‌తులు ఇప్పుడు డిపెన్స్ ఉద్యోగుల‌కు ల‌భిస్తున్నాయి. ప‌దో త‌ర‌గ‌తి పూర్తవ్వగానే ఆర్మీలో కెరీర్ ప్రారంభించొచ్చు. ఇంట‌ర్ అర్హత‌తోనే ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని అందుకోవ‌చ్చు. అర్హత‌, అభిరుచుల మేర‌కు ఆర్మీలో ప‌ది నుంచి పీజీ వ‌ర‌కూ ప‌లు ఉద్యోగాలు ఉన్నాయి. ఆ వివ‌రాలు చూద్దాం...
 
నాన్ మెట్రిక్ అర్హత‌తో...
ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణులు కాలేక‌పోయినా, ప‌ది వ‌ర‌కు చ‌ద‌వ‌క‌పోయినా నాన్ మెట్రిక్ తో సోల్జర్ ట్రేడ్స్‌మెన్ విభాగంలో ఆర్మీలో ఉద్యోగం పొందే అవ‌కాశం ఉంది. ఇందులో జ‌న‌ర‌ల్ డ్యూటీస్‌, స్పెసిఫైడ్ డ్యూటీస్ అనే రెండు విభాగాలు ఉన్నాయి. జ‌న‌ర‌ల్ డ్యూటీస్‌కి వ‌యోప‌రిమితి 17 1/2 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. అలాగే స్పెషిఫైడ్ డ్యూటీస్‌కి వ‌యోప‌రిమితి 17 1/2 నుంచి 23 ఏళ్లు. క‌నీసం ఎనిమిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివిన‌వాళ్లు ఈ ఉద్యోగాల‌కు పోటీప‌డొచ్చు.

ప‌దో త‌ర‌గ‌తితో...
సోల్జర్ జ‌న‌ర‌ల్ డ్యూటీ: ప‌దో తర‌గ‌తిలో 45 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులైతే చాలు సోల్జర్ జ‌న‌ర‌ల్ డ్యూటీకి అర్హత ల‌భించిన‌ట్టే. వ‌యోప‌రిమితి 17 1/2 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. ప్రక‌ట‌న‌లు ఏడాదిలో ప‌లుసార్లు ప్రాంతాల‌ వారీ వెలువ‌డ‌తాయి. రిక్రూట్‌మెంట్ ర్యాలీల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ముందు ప‌రుగు పోటీ ఇత‌ర ఫిజిక‌ల్ టెస్టులు నిర్వహిస్తారు. వీటిలో ఎంపికైన‌వారికి రాత ప‌రీక్ష ఉంటుంది. అందులోనూ ఉత్తీర్ణులైతే వైద్య, ఆరోగ్య ప‌రీక్షలు నిర్వహించి ఉద్యోగానికి అవ‌కాశం క‌ల్పిస్తారు.

ఇంట‌ర్ అర్హత‌తో...
సోల్జర్ టెక్నిక‌ల్‌: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణులు పోల్జర్ టెక్నిక‌ల్ పోస్టుల‌కు అర్హులు. వ‌యోప‌రిమితి 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు ఏడాదికి రెండుసార్లు ప్రక‌ట‌న‌లు వెలువ‌డతాయి. ఆయా ప్రాంతాల‌వారీ రిక్రూట్‌మెంట్ ర్యాలీల ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు.
సోల్జర్ క్లర్క్‌, స్టోర్ కీప‌ర్ టెక్నిక‌ల్‌: ఏ గ్రూప్‌తోనైనా ఇంట‌ర్ పాసైన‌వాళ్లు ఈ పోస్టుల‌కు అర్హులు. అయితే ఇంట‌ర్‌లో 50 శాతం మార్కులు పొంద‌డం త‌ప్పనిస‌రి. అలాగే ప్రతి స‌బ్జెక్టులోనూ క‌నీసం 40 శాతం మార్కులు రావాలి. వ‌యోప‌రిమితి 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు ఏడాదికి రెండుసార్లు ప్రక‌ట‌న‌లు వెలువ‌డతాయి. ఆయా ప్రాంతాల‌వారీ రిక్రూట్‌మెంట్ ర్యాలీల ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు.

సోల్జర్ న‌ర్సింగ్ అసిస్టెంట్‌: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యాల‌జీ, ఇంగ్లిష్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్‌లో 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులు సోల్జర్ న‌ర్సింగ్ అసిస్టెంట్ పోస్టుకు అర్హులు. అలాగే ప్రతి స‌బ్జెక్జులోనూ క‌నీసం 40 శాతం మార్కులు పొంద‌డం త‌ప్పనిస‌రి. వయోప‌రిమితి 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు ఏడాదికి రెండుసార్లు ప్రక‌ట‌న‌లు వెలువ‌డతాయి. ఆయా ప్రాంతాల‌వారీ రిక్రూట్‌మెంట్ ర్యాలీల ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు.
 
డిగ్రీ అర్హత‌తో...
హ‌వ‌ల్దార్ ఎడ్యుకేష‌న్‌: డిగ్రీ లేదా పీజీతోపాటు బీఎడ్ చ‌దివిన‌వాళ్లు హ‌వ‌ల్దార్ ఎడ్యుకేష‌న్ పోస్టుల‌కు అర్హులు. వ‌యోప‌రిమితి 20 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు ఏడాదికి రెండుసార్లు ప్రక‌ట‌న‌లు వెలువ‌డతాయి.
రెలిజియ‌స్ టీచ‌ర్ (జేసీవో): డిగ్రీతోపాటు సంబంధిత మ‌త డినామినేష‌న్ ఉండాలి. వ‌యోప‌రిమితి 27-34 ఏళ్లలోపు ఉండాలి.
జేసీవో(క్యాట‌రింగ్‌): 10+2తోపాటు క‌నీసం ఏడాది వ్యవ‌ధి ఉండే హోట‌ల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తిచేయాలి. వ‌యోప‌రిమితి 21 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి.
స‌ర్వేయ‌ర్ అటోమేటెడ్ కార్టోగ్రాఫ‌ర్‌: డిగ్రీలో మ్యాథ్స్ చ‌దివిన‌వాళ్లు ఈ పోస్టుల‌కు అర్హులు. అలాగే వీళ్లు ఇంట‌ర్‌లో మ్యాథ్స్‌తోపాటు సైన్స్ కోర్సులు చ‌ద‌వుండ‌డం త‌ప్పనిస‌రి. వ‌యోప‌రిమితి 20-25 ఏళ్లలోపు ఉండాలి.

త్రివిధ దళాల్లోకి తిరుగులేని దారి

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1)- 2021 నోటిఫికేషన్ విడుదల

భారత త్రివిధ దళాల్లో చేరి దేశ సేవలో భాగస్వాములు కావాలనుందా? చిన్న వయసులోనే రక్షణ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారా? జీవితంలో సవాళ్లను స్వీకరించాలని ఉందా? అయితే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) మీకు ఆ అవకాశం కల్పిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన పాతికేళ్ల లోపు యువతకు ఈ పరీక్ష వరంలాంటిది. ఆసక్తితోపాటు ప్రతిభావంతులైన యువతను గుర్తించి, వారి ప్రతిభకు పదునుపెట్టి, సుశిక్షితులుగా తీర్చిదిద్దడానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ ఎదురుచూస్తున్నాయి. ఇందులో ఎంపికైతే గౌరవం, హోదా లభిస్తాయి. ఆర్థికంగానూ మంచి అభివృద్ధి ఉంటుంది. శిక్షణ కాలం నుంచే పెద్ద వేతనాన్ని పొందవచ్చు.  ‌సీడీఎస్ ప‌రీక్ష యూపీఎస్సీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతుంది.

ఖాళీలు.. దరఖాస్తు ప్రక్రియ

మొత్తం ఖాళీలు: 345, ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్-100, ఇండియన్ నేవెల్ అకాడమీ, ఎజిమళ -26 , ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్-32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై(ఎస్ఎస్సీ మెన్ నాన్ టెక్నికల్)-170, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (ఎస్ఎస్సీ విమెన్ నాన్ టెక్నికల్)-17.

దరఖాస్తు: వెబ్సైట్ http://upsconline.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేది నవంబరు 17, 2020 సాయంత్రం 6 గంటల వరకు. అర్హత కలిగిన అభ్యర్థులు పరీక్ష తేదీ మూడు వారాల ముందు నుంచి ఈ-అడ్మిట్కార్డులను వెబ్సైట్ http://upsc.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష ఫీజు:  రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు చెల్లించాల్సిన అవసరం లేదు). ఆన్లైన్ లేదా ఎస్బీఐ బ్రాంచిలో చెల్లించవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్,తిరుపతి, విశాఖపట్నం.

అర్హతలు
25 సంవత్సరాల లోపు వయసుతో పాటు అవివాహితులై ఉండాలి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఇండియన్ మిలటరీ, ఇండియన్ నేవెల్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2 జ‌న‌వ‌రి 1998 - 1 జ‌న‌వ‌రి 2003 మ‌ధ్య జ‌న్మించిన వారు అర్హులు... ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకైతే జనవరి 1, 2022 నాటికి 20 నుంచి 24 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. జనవరి 2, 1998 ముందు, జనవరి 1, 2002 తర్వాత జన్మించిన వారు అర్హులు కారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు జనవరి 2, 1997 ముందు, జనవరి 1, 2003 తర్వాత జన్మించి ఉండకూడదు.

సీడీఎస్ఈలో ఎంపిక ఇలా..

డిగ్రీ పూర్త‌యిన యువ‌త డిఫెన్స్ రంగంలో ఉద్యోగంలో స్థిర‌ప‌డాలంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) మంచి మ‌ర్గాన్ని చూపుతుంది. ఇందుకు అనుగుణంగా సీడీఎస్ఈ ఎంపికరెండు దశల్లో జరుగుతుంది. మొద‌టి స్టేజ్లో రాత పరీక్ష, త‌రువాతి స్టేజ్లో ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.  
రాత పరీక్షలో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ అంశాల నుంచి ప్రశ్నపత్రాలు అడుగుతారు. ఒక్కో పేపర్కు 100 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ మూడు విభాగాలకు రెండు గంటల చొప్పున సమయం కేటాయించారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ ప్రశ్నపత్రం లేదు. అన్ని విభాగాల్లోని ప్రశ్నలకు బహుళైచ్ఛిక రూపంలోనే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. జవాబు తప్పుగా రాస్తే రుణాత్మక మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్ విభాగం మినహా మిగిలిన ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఇస్తారు. ఈ రాత పరీక్షలో ఎంపికైతే స్టేజ్కు అర్హత లభిస్తుంది. స్టేజ్లో నిర్వహించే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ మిగిలిన ఇంటర్వ్యూలతో పోలిస్తే కఠినతరమైనదనే చెప్పవచ్చు. ఇది అయిదు రోజులపాటు కొనసాగుతుంది. ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్ట్లు, సైకలాజికల్  పరిశీలనల ద్వారా అభ్యర్థుల తీరును క్షుణ్ణంగా సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షిస్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలవిద్యార్థులకు బెంగళూరు కేంద్రంలో ఇవి జరుగుతాయి. ఇందులో ఎంపికైతే వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు ఆర్మీలో చేరితే లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెప్టినెంట్, ఎయిర్ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాలు లభిస్తాయి.

సిలబస్ అవగాహన

ఇంగ్లిష్: అభ్యర్థి ఆంగ్లభాషను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో పరీక్షించేలా ఈ విభాగంలో ప్రశ్నలు ఉంటాయి.

జనరల్ నాలెడ్జ్: వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతదేశ చరిత్ర, భౌగోళిక శాస్త్ర అంశాలపై అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితానికి, ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించనవే ఉంటాయి.

ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్: ఇందులో అడిగే ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. అరిథ్మెటిక్, బీజగణితం, జ్యామితి, త్రికోణమితి, క్షేత్రగణితం, స్టాటిస్టిక్స్ టాపిక్ల నుంచి అడుగుతారు.

ఆర్మీలో 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ ఉద్యోగాలు

 ఇంట‌ర్ ఎంపీసీ విద్యార్థులు అర్హులు
 ఎంపికైతే ఉచితంగా ఇంజినీరింగ్ విద్య
 అనంత‌రం లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం

ఇంట‌ర్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థుల‌కు ఇంజినీరింగ్ విద్యతోపాటు లెఫ్టినెంట్ ఉద్యోగాన్ని అందిస్తోంది ఇండియ‌న్ ఆర్మీ. ఇందుకోసం 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌కు రెండు ద‌శ‌ల్లో వివిధ ప‌రీక్షలు నిర్వహించి నియామ‌కాలు చేప‌డ‌తారు. అన్ని విభాగాల్లోనూ అర్హత సాధించిన‌వారికి జులై 2018 నుంచి శిక్షణ తరగతలు ప్రారంభమవుతాయి. విజయవంతంగా శిక్షణ‌, కోర్సు పూర్తి చేసినవారికి ఆర్మీలో శాశ్వత ప్రాతిప‌దిక‌న లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగం సొంత‌మ‌వుతుంది. ఇండియ‌న్ ఆర్మీ 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీకి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం.

ఖాళీలు: 90 (నియామ‌క స‌మ‌యానికి ఖాళీల్లో మార్పులు ఉండ‌వ‌చ్చు)
అర్హత: అవివాహిత పురుషులై ఉండాలి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో 70 శాతం మార్కుల‌తో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1999 జ‌న‌వ‌రి 1 కంటే ముందు , జ‌న‌వ‌రి 1, 2002 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు.
ఎత్తు: క‌నీసం 157.5 సెం.మీ. ఉండాలి.

ఎంపిక ఇలా:
ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థుల‌ను ఇంట‌ర్ ఎంపీసీ గ్రూప్‌లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎంపికైన‌వారికి అయిదు రోజులుపాటు రెండు ద‌శ‌ల్లో అల‌హాబాద్‌, బెంగ‌ళూరు, భోపాల్‌, క‌పుర్తలా వీటిలో ఏదో ఒక చోట ఎస్‌ఎస్‌బీ సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తొలిరోజు స్టేజ్-1 ప‌రీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారిని స్టేజ్‌-2కు అనుమ‌తిస్తారు. అన్ని విభాగాల్లోనూ రాణించిన‌వారిని మెడిక‌ల్ టెస్టుకు పంపుతారు. అందులోనూ విజ‌య‌వంత‌మైతే తుది శిక్షణ‌కు ఖ‌రారుచేస్తారు.

శిక్షణ ఇలా...
కోర్సులో చేరిన‌వాళ్లకి అయిదేళ్లపాటు శిక్షణ కొన‌సాగుతుంది. తొలి ఏడాది ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ - గయలో బేసిక్‌ మిలిటరీ ట్రైనింగ్ నిర్వహిస్తారు. అనంత‌రం సాంకేతిక శిక్షణ (టెక్నికల్‌ ట్రైనింగ్‌) నాలుగేళ్లు ఉంటుంది. ఇందులో ఫేజ్‌-1 కింద ప్రీ కమిషన్‌ ట్రైనింగ్ మూడేళ్లపాటు కొన‌సాగుతుంది. ఫేజ్‌-2లో భాగంగా ఏడాదిపాటు పోస్ట్‌ కమిషన్‌ ట్రైనింగ్‌ ఉంటాయి. ఫేజ్‌-1, ఫేజ్‌-2 శిక్షణ‌లు సీఎంఈ-పుణె, ఎంసీటీఈ-మావ్‌, ఎంసీఈఎంఈ-సికింద్రాబాద్‌లో ఏదో ఒక చోట నిర్వహిస్తారు. మూడేళ్ల శిక్షణ అనంత‌రం అభ్యర్థుల‌కు నెల‌కు రూ.56,100 చొప్పున స్టయిపెండ్ చెల్లిస్తారు. నాలుగేళ్ల శిక్షణ అనంత‌రం పూర్తి వేత‌నం అమ‌ల‌వుతుంది. లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. శాశ్వత ఉద్యోగులుగా ప‌రిగ‌ణిస్తారు. కెరీర్ ఆరంభంలోనే అన్ని ప్రోత్సాహ‌కాలూ క‌లుపుకుని నెల‌కు ల‌క్ష రూపాయ‌ల‌ వ‌ర‌కు సీటీసీ రూపంలో అందుకోవ‌చ్చు. విజ‌య‌వంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి దిల్లీలోని జేఎన్‌యూ ఇంజినీరింగ్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో పూర్తిచేసి పంపించిన దరఖాస్తు నకళ్లను ఎస్‌ఎస్‌బీ పరీక్షలు, ఇంటర్వ్యూ సమయంలో తీసుకెళ్లాలి.
చివరి తేది: న‌వంబ‌రు 29 (ఉద‌యం 10 గంట‌లు)
వెబ్‌సైట్‌: 
http://www.joinindianarmy.nic.in/

ఆర్మీలో ఉద్యోగక్ర‌మం ఇలా...

దేశ ర‌క్ష‌ణ‌లో భాగ‌స్వాములు కావాల‌నుకునే నిరుద్యోగ‌ యువ‌తకు ఆర్మీ రంగం మంచి అవ‌కాశంగా ఉంటుంది. ఇందులో వివిధ స్థాయుల్లో ఉద్యోగాలు క‌ల్పిస్తున్నారు. ప‌దో త‌ర‌గ‌తి మొద‌లు డిగ్రీ, ఆ పైచ‌దువు ఉన్న వారికి ఎన్నో అవ‌కాశాలు ఉంటున్నాయి. నిబద్ధ‌త‌తో ప‌రీక్ష‌కు స‌న్న‌ద్ధ‌మై ఆర్మీ రంగంలో స్థిర‌ప‌డేందుకు ఇదే మంచి అవ‌కాశం. ఆ రంగంలో ఏ స్థాయిలో ఉద్యోగం సాధించినా ఉద్యోగార్థిలో ఉన్న నైపుణ్యం, ఉన్న‌త విద్య‌, ఇత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఉన్న‌త స్థాయికి ఎదిగే అవ‌కాశం లేక‌పోలేదు. 

ప్రారంభ స్థాయి నుంచి ఉద్యోగక్ర‌మం ఇలా...
 
సోల్జ‌ర్ (సిపాయి)

    ↓
లాన్స్ నాయ‌క్‌

    ↓
నాయ‌క్‌

    ↓
హ‌విల్దార్‌

    ↓
నాయ‌బ్ సుబేదార్‌

    ↓
సుబేదార్‌

    ↓
సుబేదార్ మేజ‌ర్‌

   ↓
లెఫ్ట్‌నెంట్‌

   ↓
కెప్టెన్‌

  ↓

మేజ‌ర్‌

    ↓
లెఫ్ట్‌నెంట్ క‌ల్న‌ల్‌

    ↓
క‌ల్న‌ల్‌

    ↓
బ్రిగేడియ‌ర్‌

     ↓
మేజ‌ర్ జ‌న‌ర‌ల్‌

     ↓
లెఫ్ట్‌నెంట్ జ‌న‌ర‌ల్‌

    ↓
జ‌న‌ర‌ల్‌

    ↓
ఫిల్డ్ మార్ష‌ల్‌

దరఖాస్తు: వెబ్సైట్ 
http://upsconline.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేది నవంబరు 17, 2020 సాయంత్రం 6 గంటల వరకు. అర్హత కలిగిన అభ్యర్థులు పరీక్ష తేదీ మూడు వారాల ముందు నుంచి ఈ-అడ్మిట్కార్డులను వెబ్సైట్ http://upsc.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష ఫీజు:  రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు చెల్లించాల్సిన అవసరం లేదు). ఆన్లైన్ లేదా ఎస్బీఐ బ్రాంచిలో చెల్లించవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్,తిరుపతి, విశాఖపట్నం.

అర్హతలు
25 సంవత్సరాల లోపు వయసుతో పాటు అవివాహితులై ఉండాలి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఇండియన్ మిలటరీ, ఇండియన్ నేవెల్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2 జ‌న‌వ‌రి 1998 - 1 జ‌న‌వ‌రి 2003 మ‌ధ్య జ‌న్మించిన వారు అర్హులు... ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకైతే జనవరి 1, 2022 నాటికి 20 నుంచి 24 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. జనవరి 2, 1998 ముందు, జనవరి 1, 2002 తర్వాత జన్మించిన వారు అర్హులు కారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు జనవరి 2, 1997 ముందు, జనవరి 1, 2003 తర్వాత జన్మించి ఉండకూడదు.

ఆర్మీలో 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ ఉద్యోగాలు

ఇంట‌ర్ ఎంపీసీ విద్యార్థులు అర్హులు
ఎంపికైతే ఉచితంగా ఇంజినీరింగ్ విద్య
అనంత‌రం లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం
 
ఇంట‌ర్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థుల‌కు ఇంజినీరింగ్ విద్యతోపాటు లెఫ్టినెంట్ ఉద్యోగాన్ని అందిస్తోంది ఇండియ‌న్ ఆర్మీ. ఇందుకోసం 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌కు రెండు ద‌శ‌ల్లో వివిధ ప‌రీక్షలు నిర్వహించి నియామ‌కాలు చేప‌డ‌తారు. అన్ని విభాగాల్లోనూ అర్హత సాధించిన‌వారికి జులై 2018 నుంచి శిక్షణ తరగతలు ప్రారంభమవుతాయి. విజయవంతంగా శిక్షణ‌, కోర్సు పూర్తి చేసినవారికి ఆర్మీలో శాశ్వత ప్రాతిప‌దిక‌న లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగం సొంత‌మ‌వుతుంది. ఇండియ‌న్ ఆర్మీ 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీకి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం.

ఖాళీలు: 90 (నియామ‌క స‌మ‌యానికి ఖాళీల్లో మార్పులు ఉండ‌వ‌చ్చు)
అర్హత: అవివాహిత పురుషులై ఉండాలి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో 70 శాతం మార్కుల‌తో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1999 జ‌న‌వ‌రి 1 కంటే ముందు , జ‌న‌వ‌రి 1, 2002 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు.
ఎత్తు: క‌నీసం 157.5 సెం.మీ. ఉండాలి.
 
ఎంపిక ఇలా:
ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థుల‌ను ఇంట‌ర్ ఎంపీసీ గ్రూప్‌లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎంపికైన‌వారికి అయిదు రోజులుపాటు రెండు ద‌శ‌ల్లో అల‌హాబాద్‌, బెంగ‌ళూరు, భోపాల్‌, క‌పుర్తలా వీటిలో ఏదో ఒక చోట ఎస్‌ఎస్‌బీ సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తొలిరోజు స్టేజ్-1 ప‌రీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారిని స్టేజ్‌-2కు అనుమ‌తిస్తారు. అన్ని విభాగాల్లోనూ రాణించిన‌వారిని మెడిక‌ల్ టెస్టుకు పంపుతారు. అందులోనూ విజ‌య‌వంత‌మైతే తుది శిక్షణ‌కు ఖ‌రారుచేస్తారు.
 
శిక్షణ ఇలా...
కోర్సులో చేరిన‌వాళ్లకి అయిదేళ్లపాటు శిక్షణ కొన‌సాగుతుంది. తొలి ఏడాది ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ - గయలో బేసిక్‌ మిలిటరీ ట్రైనింగ్ నిర్వహిస్తారు. అనంత‌రం సాంకేతిక శిక్షణ (టెక్నికల్‌ ట్రైనింగ్‌) నాలుగేళ్లు ఉంటుంది. ఇందులో ఫేజ్‌-1 కింద ప్రీ కమిషన్‌ ట్రైనింగ్ మూడేళ్లపాటు కొన‌సాగుతుంది. ఫేజ్‌-2లో భాగంగా ఏడాదిపాటు పోస్ట్‌ కమిషన్‌ ట్రైనింగ్‌ ఉంటాయి. ఫేజ్‌-1, ఫేజ్‌-2 శిక్షణ‌లు సీఎంఈ-పుణె, ఎంసీటీఈ-మావ్‌, ఎంసీఈఎంఈ-సికింద్రాబాద్‌లో ఏదో ఒక చోట నిర్వహిస్తారు. మూడేళ్ల శిక్షణ అనంత‌రం అభ్యర్థుల‌కు నెల‌కు రూ.56,100 చొప్పున స్టయిపెండ్ చెల్లిస్తారు. నాలుగేళ్ల శిక్షణ అనంత‌రం పూర్తి వేత‌నం అమ‌ల‌వుతుంది. లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. శాశ్వత ఉద్యోగులుగా ప‌రిగ‌ణిస్తారు. కెరీర్ ఆరంభంలోనే అన్ని ప్రోత్సాహ‌కాలూ క‌లుపుకుని నెల‌కు ల‌క్ష రూపాయ‌ల‌ వ‌ర‌కు సీటీసీ రూపంలో అందుకోవ‌చ్చు. విజ‌య‌వంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి దిల్లీలోని జేఎన్‌యూ ఇంజినీరింగ్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
 
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో పూర్తిచేసి పంపించిన దరఖాస్తు నకళ్లను ఎస్‌ఎస్‌బీ పరీక్షలు, ఇంటర్వ్యూ సమయంలో తీసుకెళ్లాలి.
చివరి తేది: న‌వంబ‌రు 29 (ఉద‌యం 10 గంట‌లు)
వెబ్‌సైట్‌: http://www.joinindianarmy.nic.in/
 
ప‌ది నుంచి పీజీ వ‌ర‌కు ఆర్మీలో ఉద్యోగాలివీ...

ర‌క్షణ‌ ద‌ళంలో ఉద్యోగ‌మంటే దేశానికి సేవ‌చేసే అవ‌కాశాన్ని ద‌క్కించుకోవ‌డ‌మే. అయితే సేవ‌తోపాటు సంతృప్తి, ఆక‌ర్షణీయ వేత‌నం, ప‌లు ర‌కాల భ‌త్యాలు, వ‌స‌తులు ఇప్పుడు డిపెన్స్ ఉద్యోగుల‌కు ల‌భిస్తున్నాయి. ప‌దో త‌ర‌గ‌తి పూర్తవ్వగానే ఆర్మీలో కెరీర్ ప్రారంభించొచ్చు. ఇంట‌ర్ అర్హత‌తోనే ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని అందుకోవ‌చ్చు. అర్హత‌, అభిరుచుల మేర‌కు ఆర్మీలో ప‌ది నుంచి పీజీ వ‌ర‌కూ ప‌లు ఉద్యోగాలు ఉన్నాయి. ఆ వివ‌రాలు చూద్దాం...
 
నాన్ మెట్రిక్ అర్హత‌తో...
ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణులు కాలేక‌పోయినా, ప‌ది వ‌ర‌కు చ‌ద‌వ‌క‌పోయినా నాన్ మెట్రిక్ తో సోల్జర్ ట్రేడ్స్‌మెన్ విభాగంలో ఆర్మీలో ఉద్యోగం పొందే అవ‌కాశం ఉంది. ఇందులో జ‌న‌ర‌ల్ డ్యూటీస్‌, స్పెసిఫైడ్ డ్యూటీస్ అనే రెండు విభాగాలు ఉన్నాయి. జ‌న‌ర‌ల్ డ్యూటీస్‌కి వ‌యోప‌రిమితి 17 1/2 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. అలాగే స్పెషిఫైడ్ డ్యూటీస్‌కి వ‌యోప‌రిమితి 17 1/2 నుంచి 23 ఏళ్లు. క‌నీసం ఎనిమిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివిన‌వాళ్లు ఈ ఉద్యోగాల‌కు పోటీప‌డొచ్చు.

ప‌దో త‌ర‌గ‌తితో...
సోల్జర్ జ‌న‌ర‌ల్ డ్యూటీ: ప‌దో తర‌గ‌తిలో 45 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులైతే చాలు సోల్జర్ జ‌న‌ర‌ల్ డ్యూటీకి అర్హత ల‌భించిన‌ట్టే. వ‌యోప‌రిమితి 17 1/2 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. ప్రక‌ట‌న‌లు ఏడాదిలో ప‌లుసార్లు ప్రాంతాల‌ వారీ వెలువ‌డ‌తాయి. రిక్రూట్‌మెంట్ ర్యాలీల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ముందు ప‌రుగు పోటీ ఇత‌ర ఫిజిక‌ల్ టెస్టులు నిర్వహిస్తారు. వీటిలో ఎంపికైన‌వారికి రాత ప‌రీక్ష ఉంటుంది. అందులోనూ ఉత్తీర్ణులైతే వైద్య, ఆరోగ్య ప‌రీక్షలు నిర్వహించి ఉద్యోగానికి అవ‌కాశం క‌ల్పిస్తారు.

ఇంట‌ర్ అర్హత‌తో...
సోల్జర్ టెక్నిక‌ల్‌: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణులు పోల్జర్ టెక్నిక‌ల్ పోస్టుల‌కు అర్హులు. వ‌యోప‌రిమితి 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు ఏడాదికి రెండుసార్లు ప్రక‌ట‌న‌లు వెలువ‌డతాయి. ఆయా ప్రాంతాల‌వారీ రిక్రూట్‌మెంట్ ర్యాలీల ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు.
సోల్జర్ క్లర్క్‌, స్టోర్ కీప‌ర్ టెక్నిక‌ల్‌: ఏ గ్రూప్‌తోనైనా ఇంట‌ర్ పాసైన‌వాళ్లు ఈ పోస్టుల‌కు అర్హులు. అయితే ఇంట‌ర్‌లో 50 శాతం మార్కులు పొంద‌డం త‌ప్పనిస‌రి. అలాగే ప్రతి స‌బ్జెక్టులోనూ క‌నీసం 40 శాతం మార్కులు రావాలి. వ‌యోప‌రిమితి 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు ఏడాదికి రెండుసార్లు ప్రక‌ట‌న‌లు వెలువ‌డతాయి. ఆయా ప్రాంతాల‌వారీ రిక్రూట్‌మెంట్ ర్యాలీల ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు.

సోల్జర్ న‌ర్సింగ్ అసిస్టెంట్‌: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యాల‌జీ, ఇంగ్లిష్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్‌లో 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులు సోల్జర్ న‌ర్సింగ్ అసిస్టెంట్ పోస్టుకు అర్హులు. అలాగే ప్రతి స‌బ్జెక్జులోనూ క‌నీసం 40 శాతం మార్కులు పొంద‌డం త‌ప్పనిస‌రి. వయోప‌రిమితి 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు ఏడాదికి రెండుసార్లు ప్రక‌ట‌న‌లు వెలువ‌డతాయి. ఆయా ప్రాంతాల‌వారీ రిక్రూట్‌మెంట్ ర్యాలీల ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు.
 
డిగ్రీ అర్హత‌తో...
హ‌వ‌ల్దార్ ఎడ్యుకేష‌న్‌: డిగ్రీ లేదా పీజీతోపాటు బీఎడ్ చ‌దివిన‌వాళ్లు హ‌వ‌ల్దార్ ఎడ్యుకేష‌న్ పోస్టుల‌కు అర్హులు. వ‌యోప‌రిమితి 20 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు ఏడాదికి రెండుసార్లు ప్రక‌ట‌న‌లు వెలువ‌డతాయి.
రెలిజియ‌స్ టీచ‌ర్ (జేసీవో): డిగ్రీతోపాటు సంబంధిత మ‌త డినామినేష‌న్ ఉండాలి. వ‌యోప‌రిమితి 27-34 ఏళ్లలోపు ఉండాలి.
జేసీవో(క్యాట‌రింగ్‌): 10+2తోపాటు క‌నీసం ఏడాది వ్యవ‌ధి ఉండే హోట‌ల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తిచేయాలి. వ‌యోప‌రిమితి 21 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి.
స‌ర్వేయ‌ర్ అటోమేటెడ్ కార్టోగ్రాఫ‌ర్‌: డిగ్రీలో మ్యాథ్స్ చ‌దివిన‌వాళ్లు ఈ పోస్టుల‌కు అర్హులు. అలాగే వీళ్లు ఇంట‌ర్‌లో మ్యాథ్స్‌తోపాటు సైన్స్ కోర్సులు చ‌ద‌వుండ‌డం త‌ప్పనిస‌రి. వ‌యోప‌రిమితి 20-25 ఏళ్లలోపు ఉండాలి.

వెబ్‌సైట్లు: http://joinindianarmy.nic.in, https://www.upsc.gov.in/

సైన్యంలోకి స్పెషల్‌ ఎంట్రీ!

గ్రాడ్యుయేట్లకు అవకాశం
మౌఖిక పరీక్షల ద్వారా నియామకాలు 

ఇండియన్‌ ఆర్మీ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ పోస్టులకు ప్రకటనలు వెలువరించింది. మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో శిక్షణలోకి తీసుకుంటారు. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఆకర్షణీయ వేతనాలు, ప్రోత్సాహకాలు అందిస్తారు!

ఇండియన్‌ ఆర్మీ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో ఏడాదికి రెండుసార్లు ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ పోస్టులకు ప్రకటనలు విడుదల చేస్తోంది. వచ్చిన దరఖాస్తులను వారి మార్కుల ఆధారంగా షార్ట్‌ లిస్టు చేస్తారు. ఇలా వడపోతలో నిలిచినవారికి సెలక్షన్‌ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దక్షిణ భారతీయులకు బెంగళూరులో ఈ మౌఖిక పరీక్షలు ఉంటాయి. సైకాలజిస్ట్, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్‌ల ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. రెండు దశల్లో అయిదు రోజుల పాటు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్‌ 1లో ఉత్తీర్ణులు మాత్రమే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్‌ 2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. ఇందులో విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు. 

శిక్షణ.. వేతనాలు

వీరికి ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని మద్రాస్‌ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. వీరిని లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని పర్మనెంట్‌ కమిషన్‌లోకి (శాశ్వత ఉద్యోగం) తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్‌ పొడిగిస్తారు. అనంతరం వైదొలగాల్సి ఉంటుంది. 

లెఫ్టినెంట్‌గా విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల అనుభవంతో మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలకు చేరుకోవచ్చు. విధుల్లో చేరినవారికి రూ.56,100 మూలవేతనంతోపాటు మిలట్రీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనంగా అందుకోవచ్చు. ప్రోత్సాహకాలూ పొందవచ్చు. 

దరఖాస్తు ఎప్పుడు?

పోస్టు: ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ 

మొత్తం ఖాళీలు: 55. వీటిలో 50 పురుషులకు, 5 మహిళలకు కేటాయించారు. ఈ రెండు విభాగాల్లోనూ 6 (పురుషులు 5, మహిళలు 1) పోస్టులు యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు దక్కుతాయి.  

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మూడు అకడమిక్‌ సంవత్సరాలు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ వింగ్‌లో కొనసాగి ఉండాలి. ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌లో కనీసం బి గ్రేడ్‌ పొంది ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌ అవసరం లేదు. 

వయసు: జనవరి 1, 2021 నాటికి 19 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1996 - జనవరి 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 28 మధ్యాహ్నం 3 వరకు స్వీకరిస్తారు. 

వెబ్‌సైట్‌: http://www.joinindianarmy.nic.in/Authentication.aspx